Moviesవెంకటేష్ చేతిలో పట్టుకున్న ఈ ఫోన్ లో మీరు ఇది గమనించారా.....

వెంకటేష్ చేతిలో పట్టుకున్న ఈ ఫోన్ లో మీరు ఇది గమనించారా.. జూమ్ చేసి చూడండి షాక్ అయిపోతారు..!!

దేశవ్యాప్తంగా దివాళి పండుగను చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీ లు ఏ విధంగా దివాళి సెలబ్రేషన్స్ చేసుకున్నామో అని పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు . కాగా రామ్ చరణ్ – ఉపాసన తమకు క్లీం కారా పుట్టిన శుభ సందర్భంగా దివాళి పార్టీను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు .

ఈ ఈవెంట్ కు ఆల్మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలు వాళ్ళ భార్యలతో వచ్చి పార్టీను గ్రాండ్ సక్సెస్ చేశారు . మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా పేరు సంపాదించుకున్న వైష్ణవ తేజ్ , సాయిధరమ్ తేజ్ , అల్లు శిరీష్ లు కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరోస్ నాగార్జున – చిరంజీవి – వెంకటేష్ ఓ పిక్చర్ ని దిగారు .

ఆ పిక్చర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఆ తర్వాత బన్నీ – వెంకటేష్ కూడా కొన్ని ఫొటోస్ దిగారు . ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే ఇప్పుడు వెంకటేష్ చేతిలో పట్టుకొని ఉన్న ఫోన్ కి సంబంధించిన ఓ పిక్చర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మీరు బాగా గమనించినట్లయితే వెంకటేష్ చేతిలో పట్టుకొని ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ పగిలిపోయింది .

సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ పగిలిపోయిన ఫోన్లను ఇంట్లో ఉంచుకోరు అవి ఇచ్చేసి ఇంకా డబ్బులు వేసి మంచి ఫోన్ కొనుక్కుంటారు. అయితే వెంకటేష్ ఇప్పటికీ పగిలిపోయిన వాడుతూ ఉండడం ఆయనలోని మంచితనానికి మారుపేరు అంటూ ఆయన అభిమానులు పొగిడేస్తున్నారు . ఈయన సింప్లిసిటీకి సోషల్ మీడియాలో జనాలు ఫిదా అయిపోయి కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news