Newsచరణ్ సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్.. స్టేజీ పైనే కీలక ప్రకటన...

చరణ్ సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్.. స్టేజీ పైనే కీలక ప్రకటన చేసిన స్టార్ డైరెక్టర్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత రసవత్తరంగా సాగుతుందో చూస్తున్నాం . ఎప్పుడు ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే బిగ్ బాస్ ట్రోఫీ అందుకునేది మాత్రం శివాజీ అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు . సోషల్ మీడియాలో పోల్స్ ఆధారంగా కూడా అదే ఫైనలైజ్ అవుతుంది .

రీసెంట్గా దివాళి సందర్భంగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు . ఈ క్రమంలోనే స్టేజ్ పైకి వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు సన హౌస్ లోని కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ బాగా సందడి చేశారు. అంతేకాదు త్వరలోనే తెరకెక్కించబోతున్న రామ్ చరణ్ సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ కు బిగ్ ఆఫర్ ఇచ్చారు .

అతను మరెవరో కాదు అర్జున్ అంబాటి . ఈ విషయాన్ని స్టేజిపై అఫీషియల్ గా ప్రకటించాడు . రామ్ చరణ్ సినిమాలో నువ్వు మంచి రోల్ చేస్తున్నావ్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే సీరియల్స్ లో పాపులారిటీ అయిన అర్జున్ అంబాటి.. ఏకంగా రామ్ చరణ్ సినిమాలో అవకాశం దక్కించుకోవడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news