News' భ‌గ‌వంత్ కేస‌రి ' ఓటీటీ డేట్ వ‌చ్చేసింది.. ఈ నెల‌లోనే......

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ఓటీటీ డేట్ వ‌చ్చేసింది.. ఈ నెల‌లోనే… నంద‌మూరి ఫ్యాన్స్ ర‌చ్చే..!

నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా భగవంత్‌ కేసరి. బాలయ్య కు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించినా శ్రీ‌లీల‌ బాలయ్య కూతురు పాత్రలో నటించింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా కానుకగా ఈ నెల 19న థియేటర్లలోకి వచ్చింది.

తర్వాత బాలయ్య ఖాతాలో వరుసగా మూడో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. దాదాపు అన్ని ఏరియాలోను బ్రేక్ ఈవెన్ దాటేసింది. వెండితెరపై ఇప్పటికే వీరవిహారం చేస్తున్న బాలయ్య భగవంత్‌ కేసరి ఈ నెలలోనే ఓటీటీ వ‌ద్ద‌ కూడా రిలీజ్ కానుంది. నవంబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమేజాన్‌ ప్రైమ్ వీడియోలో భగవంత్‌ కేసరి ప్రసారం కానుంది.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఏది ఏమైనా సినిమా రిలీజ్ అయిన నెల రోజులకే బాలయ్య సినిమా ఓటీటీలోకి వస్తే నందమూరి ఫ్యాన్స్ రచ్చ ఆపలేం. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించగా.. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news