News' భ‌గ‌వంత్ కేస‌రి ' ఫుల్ ర‌న్ లెక్క‌లివే... బాల‌య్య తెచ్చిన...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ఫుల్ ర‌న్ లెక్క‌లివే… బాల‌య్య తెచ్చిన లాభం ఎన్ని కోట్లు అంటే…!

నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన భగవంత్ కేస‌రి సినిమా విజయవంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టింది. బాలయ్యకు అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత ఇది వరుస‌గా మూడో సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాకు పోటీగా మరో సినిమా థియేటర్లో లేకపోవడం కూడా బాలయ్య సినిమాకు బాగా కలిసి వచ్చింది. భగవంత్‌ కేసరి ఫుల్ రన్ దాదాపు ముగిసినట్టే అని చెప్పాలి.

అధికారిక లెక్కల ప్రకారం భగవంత్ కేస‌రి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.57.63 కోట్ల బిజినెస్ చేయగా ఈ సినిమాకు రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లకు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా విడుదలై ఉంటే మరింత మెరుగ్గా కలెక్షన్లు సాధించేదని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి.

భగవంత్ కేస‌రి సినిమా వల్ల బాలయ్య శ్రీలీల కెరీర్ కు చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఈ సినిమాతో వరుసగా ఏడో విజయం మనోడి ఖాతాలో పడింది. ఇక ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.13 కోట్లకు పైగా లాభాలు వచ్చాయని చెప్పాలి. ఏది ఏమైనా బాలయ్య సినిమాకు క్రేజ్ రోజురోజుకు పెరుగుతుంది. అఖండ తర్వాత వీరసింహారెడ్డికి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

ఇప్పుడు భగవంత్ కేస‌రి కూడా గట్టి పోటీ మధ్యలో యావరేజ్ టాక్‌తో జ‌ర్ని ప్రారంభించింది. ఈ సినిమా కొన్నవారికి రూ.13 కోట్లకు పైగా లాభాలు తేవటం అంటే మామూలు విషయం కాదు. ఇక బాలయ్య తన కెరీర్లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్టును డైరెక్టర్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news