Newsకడపలో ఆ రికార్డ్ సాధించిన ఏకైక హీరో బాలయ్య మాత్రమే.. పాన్...

కడపలో ఆ రికార్డ్ సాధించిన ఏకైక హీరో బాలయ్య మాత్రమే.. పాన్ ఇండియా హీరోలను మించిన స్టార్‌..!

బాలయ్య సినిమాలలోని డైలాగ్స్ లో “చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే” డైలాగ్ చాలా ఫేమస్ అనే సంగతి తెలిసిందే. అయితే రియల్ లైఫ్ లో కూడా బాలయ్య చరిత్ర సృష్టించడంతో పాటు చరిత్ర తిరగరాస్తున్నారు. సీడెడ్ లో బాలయ్య సినిమాలు సృష్టిస్తున్న సంచలనాలు పాన్ ఇండియా హీరోలకు సైతం షాకిస్తున్నాయి. ఎవరికీ సాధ్యం కాని రికార్డులను ఆరు పదుల వయస్సులో అలవోకగా బాలయ్య సాధిస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా కడపలో వరుసగా మూడు సినిమాలతో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న హీరో బాలయ్య మాత్రమే కావడం గమనార్హం. కడపలో బాలయ్యకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పడానికి ఇదే సాక్ష్యమని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. రాయలసీమలోని మిగతా జిల్లాలలో సైతం బాలయ్య సినిమాలకు అదుర్స్ అనేలా కలెక్షన్లు వస్తున్నాయి.

సాధారణంగా హిట్ సినిమాలు 50 రోజులు, 100 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించబడటం సర్వ సాధారణం కాగా ఎమ్మిగనూరు, ఆదోని ఏరియాలలో బాలయ్య ఫ్లాప్ సినిమాలు సైతం 100 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. భగవంత్ కేసరి 50 డేస్ సెంటర్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భగవంత్ కేసరి విడుదలైన తర్వాత ఆ రేంజ్ లో హిట్టైన మరో తెలుగు సినిమా లేదు.

ఓటీటీలో సైతం భగవంత్ కేసరి ప్రభంజనం కొనసాగుతోంది. సింహా పేరు ఉంటే బాలయ్య సినిమాలు సక్సెస్ సాధిస్తాయని సెంటిమెంట్ ఉంది. భగవంత్ కేసరి టైటిల్ లో కేసరి అంటే సింహం అనే అర్థం వస్తుంది. బాలయ్య బాబీ కాంబో మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారని 2024 జనవరిలో టైటిల్ ను రివీల్ చేయనున్నారని సమాచారం. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news