Newsనీ ఫ్యూచ‌ర్ నాద‌ని ఆ హీరోయిన్‌కు మాట ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌......

నీ ఫ్యూచ‌ర్ నాద‌ని ఆ హీరోయిన్‌కు మాట ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌… అయినా ఎందుకు వ‌దిలేసింది..?

తెలుగులో రౌడీ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ అంటే బాలీవుడ్ హీరోయిన్స్ పడి చచ్చిపోతున్నారు. చాలామంది విజయ్ తో డేటింగ్ చేయడానికి కూడా రెడీగా ఉంటున్నారు. తెలుగులో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఆల్రెడీ లవ్ ట్రాక్ సాగుతుందని ప్రచారం సాగుతుంది.

అది నిజమే అన్నట్టుగా కూడా వీరి ప్రవర్తన ఉంది. విజయ్ దేవరకొండ ముంబైలో లైగర్ షూటింగ్ లో పాల్గొంటుంటే రష్మిక మందన్న పనికట్టుకొని ఫ్లైటెక్కి ముంబై వెళ్ళి అక్కడ స్ట్రీట్స్ లో బాగా చక్కర్లు కొట్టి డిన్నర్లు చేసి మీడియా కంటికి చిక్కారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా కూడా వీరి కుటుంబాలు కలిసి జరుపుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఇక సమంత కూడా విజయ్ తో సన్నిహితంగా ఉంటుందనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. దీనికి కారణం ఇద్దరూ రాత్రిళ్ళు వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉండటమే. అయితే బాలీవుడ్ భామ అనన్య పాండే కూడా విజయ్ అంటే పిచ్చ క్రష్ తో ఉందట. లైగర్ సమయంలోనే ఇద్దరూ బాగా దగ్గరయ్యారని ముంబై మీడియాలో చెప్పుకున్నారు.

ఆ సినిమా షూటింగ్ సమయంలో విజ్య కూడా అనన్య కి మాటిచ్చాడట. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో మరికొన్ని సినిమాలకి సిఫార్సు చేస్తానని. కానీ, లైగర్ ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. ఆ సినిమా గనక హిట్టై ఉంటే అనన్య ఇప్పటికే తెలుగులో అరడజను సినిమాలను చేస్తూ ఉండేది. కానీ, ఆ ఛాన్స్ పూరి ఇవ్వలేదు. లైగర్ కొట్టిన దెబ్బకి అందరూ సతమతమయ్యారు. ఇక అనన్య లాంటి అప్‌కమింగ్ హీరోయిన్ ని ఎవరు పట్టించుకుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news