Newsమ‌హేష్‌బాబు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్లో మిస్ అయిన మ‌ల్టీస్టార‌ర్ ఇదే..!

మ‌హేష్‌బాబు – ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్లో మిస్ అయిన మ‌ల్టీస్టార‌ర్ ఇదే..!

టాలీవుడ్ లో ఈ తరం జనరేషన్లో ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరోగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కు మంచి పేరు ఉంది. ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి అంటే ముందుగా చొరవ చూపి నటించిన వెంకటేష్. ఇప్పటికే వెంకటేష్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేశారు. అలాగే కుర్ర హీరో రామ్‌తో కూడా మసాలా సినిమాలో నటించారు. వెంకటేష్ చింతకాయల రవి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు వేశాడు..

అలాగే నాగచైతన్య, రానాతోను వెంకటేష్ నటించాడు. వ‌రుస‌గా మల్టీ స్టార్ సినిమాలలో నటిస్తూ మంచి సంస్కృతికి ఆయన శ్రీకారం చుట్టారు. వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మల్టీ స్టార‌ర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. దిల్ రాజు నిర్మాతగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. అంజలి, సమంత హీరోయిన్గా నటించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన‌ ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది.

వెంకటేష్ – మ‌హేష్‌బాబు లాంటి హీరోలు కలిసిన నటించడం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచింది. అయితే ఈ సినిమాలో పెద్దోడు, చిన్నోడు పాత్రలకు ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సూపర్ స్టార్ మహేష్ బాబును అనుకున్నాడట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజుకు కూడా చెప్పారు. అయితే కాంబినేషన్ సెట్ కాకపోవడంతో వెంకీ – మహేష్ బాబుతో చేసి సూపర్ హిట్ కొట్టారు.

ఆ తర్వాత వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి గోపాల గోపాల సినిమాలో నటించారు. ఏది ఏమైనా టాలీవుడ్ లో ఎవరు ఊహించిన విధంగా రాజమౌళి ఎన్టీఆర్ – రామ్ చరణ్‌తో ఆర్ఆర్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా కొట్టాడు. అలాగే మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు అంతకుమించిన ఆనందం ఉండదు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూద్దాం

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news