Newsఇన్ స్టా ఫాలోయింగ్‌లో దుమ్ము లేపుతోన్న టాప్ - 5 హీరోయిన్లు...

ఇన్ స్టా ఫాలోయింగ్‌లో దుమ్ము లేపుతోన్న టాప్ – 5 హీరోయిన్లు వీళ్లే…!

సెలబ్రిటీలు కెరీర్ తో పాటు సోషల్ మీడియాలో ఎక్కువ పాపులారిటీ అనేది కూడా ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు ఎంతోమంది స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లు ఇప్పుడు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా బాగా అర్జిస్తున్నారు. ఇండియాలో ఇప్పటివరకు ఇన్‌స్టాలో నెంబర్ వన్ గా ఉన్న స్టార్ ఎవరు అంటే ? గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తోంది.

ఆమెకు ఇండియాతో పాటు.. ఇండియా బయట కూడా ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇప్ప‌టికి 89.7 మిలియన్ల (8.97 కోట్లు) మంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లను ఆమె క‌లిగి ఉంది. ప్రియాంక చోప్రా తర్వాత ఇప్పుడు ఈ ఫాలోయింగ్ లో రెండవ స్థానంలో ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా ? సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. ప్రియాంక చోప్రా తర్వాత శ్రద్ధా కపూర్ కు అంతటి ఫాలోయింగ్ ఉంది.

శ్రద్ధాకు ఇన్‌స్టాగ్రామ్ లో 8 కోట్ల 36 లక్షల మంది (83.6 మిలియన్లు) అభిమానులు ఉన్నారు. ప్రియాంక చోప్రా తర్వాత శ్రద్ధ కపూర్ ఈ ప్లేస్ లో రెండో స్థానంలో ఉంది. శ్రద్ధా కూల్ గర్ల్.. ఓన్లీ తన సింపుల్ నేచర్‌తో ఎక్కువ మంది నెటిజన్ల అభిమానం సంపాదించుకుంది. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా లక్షల్లో లైకులు కామెంట్ల‌ వర్షం కురుస్తూ ఉంటుంది. శ్రద్ధ కపూర్ తర్వాత ఆలియా భట్ 80.2 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్లతో టాప్ త్రీ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత దీపికా పదుకొనేకు 76.5 మిలియన్ల‌ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక గత ఏడాది పెళ్లి చేసుకున్న కత్రినాకు 684 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. కత్రినా భర్త హీరో విక్కీ కౌశల్ కి ప్రస్తుతం 14.4 మిలియన్ మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. టాలీవుడ్ అగ్ర కథానాయక సమంతకు 30.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక ప్రపంచంలోనే ఏకంగా 222 మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న భారతీయుడుగా విరాట్ కోహ్లీ రికార్డులకి ఎక్కారు. దీనిని బట్టి ఇన్‌స్టా ద్వారా కూడా మన సెలబ్రిటీలకు కమర్షియల్ ప్రకటనలతో భారీగా ఆదాయం దక్కుతుందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news