News' భ‌గ‌వంత్ కేస‌రి ' ... నా కొడుకులు ఏదో వాగుతున్నారంటూ...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ … నా కొడుకులు ఏదో వాగుతున్నారంటూ రెచ్చిపోయిన థ‌మ‌న్‌..

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమన్ పాటలు ఒక్కోసారి బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ ఉంటాయి. మరోసారి ట్రోలింగ్‌కు గుర‌వుతుంటాడు. ఏది ఏమైనా అల వైకుంఠపురంలో – అఖండ సినిమాల తర్వాత టాలీవుడ్ లో తమన్‌ పేరు మారుమోగిపోతుంది. అయితే తమన్ ఎక్కువగా స్టార్ హీరోలు సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఎక్కువ ఛాన్సులు వస్తూ ఉండటం.. అన్నీ స్టార్ హీరోల సినిమాలే కావడంతో అందరి సినిమాలకు ఒకేలా మ్యూజిక్ అయితే ఇవ్వటం లేదు.

దీంతో కొన్ని సినిమాలకు క్వాలిటీ మిస్ అవుతున్న మాట నిజం. ఉదాహరణకు అఖండ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమన్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు ఆ స్థాయిలో ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు మంచి మ్యూజిక్ ఇవ్వలేదన్న విమర్శలు అయితే ఎదుర్కొన్నాడు. ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమా అవుట్ ఫుట్ విషయంలోను మహేష్ ఏమాత్రం సంతృప్తిగా లేడన్న ప్రచారం జరుగుతోంది.

అయితే తాజాగా వచ్చిన బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాకు మాత్రం తమన్ అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చాడు. అయితే తమన్ పై ఇటీవల కాలంలో నెగెటివిటీ ఎక్కువ అవుతుంది. తాజాగా భగవంత్‌ కేసరి సినిమా సక్సెస్ మీట్ లో తమన్ కాస్త ఘాటుగా మాట్లాడాడు.

ట్విట్టర్ తెరిస్తే చాలు.. నా కొడుకులు ఏదేదో వాగుతున్నారు, వాళ్లకేం తెలుసంటూ కాస్త ఘాటుగా మాట్లాడారు. ఈ డైలాగులు, కౌంట‌ర్లు త‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్లే అని అంటున్నారు. ఇక భ‌గ‌వంత్ కేస‌రి సినిమా ఆర్ ఆర్ విష‌యంలో ప్ర‌శంస‌లు ఎదుర్కొన్న థ‌మ‌న్‌.. స్కంద‌ ఆర్ ఆర్ విష‌యంలో విమ‌ర్శలు ఎదుర్కొన్నాడు. స్కంద ఆర్ ఆర్ పై బోయ‌పాటి సైతం త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news