Newsబాలయ్య ఫస్ట్ టైం పీకల్లోతు ప్రేమలో పడిన ఆ స్టార్ హీరోయిన్...

బాలయ్య ఫస్ట్ టైం పీకల్లోతు ప్రేమలో పడిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.. వీళ్ళ పెళ్లికి బ్రేకులు వేసింది ఎవరంటే..?

నందమూరి నటసింహం బాలకృష్ణ నాలుగు దశాబ్దాలుగా తన సినిమా కెరీర్ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సినీ కెరీర్లో బాలయ్య ఇప్పటివరకు 108 సినిమాలలో నటించారు. బాలయ్య తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. మూడు దశాబ్దల తర్వాత బాలయ్యకు ఇదే తొలి హ్యాట్రిక్ హిట్ కావటం విశేషం. ఇన్నేళ్ల కెరీర్లో 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ఎంతో మంది హీరోయిన్లతో రొమాన్స్ చేశారు.

అయితే కొందరు హీరోయిన్ల విషయంలో ఆయన బాగా సన్నిహితంగా ఉన్నారన్న చర్చ అయితే నడిచింది. మరీ ముఖ్యంగా విజయశాంతి, సిమ్రాన్ లాంటి హీరోయిన్ల విషయంలో బాలయ్య పై ఎక్కువగా రూమర్లు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు హీరోయిన్ల కంటే ముందుగా కెరీర్ ప్రారంభంలో వసుంధరతో బాలయ్య పెళ్లి జరగడానికి ముందే ఒక హీరోయిన్ తో ఘాటుగా ప్రేమలో పడ్డారన్న ప్రచారం అప్పట్లో సినీ వర్గాల్లో గట్టిగా నడిచింది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు ? అప్పటి తమిళ్ స్టార్ హీరోయిన్ కుష్బూ. కుష్బూ తెలుగులో నాగార్జున స‌ర‌స‌న కెప్టెన్ నాగార్జున‌, వెంకటేష్ తొలి సినిమా క‌లియుగ‌ పాండవులు లాంటి సినిమాలలో నటించింది. అప్పట్లో ఆమె తమిళంలో యంగ్ హీరోయిన్. బాలయ్య కూడా చెన్నైలోనే ఉండేవారు. వీరిద్దరి మధ్య ఎలా ?సాన్నిహిత్యం ఏర్పడిందో కానీ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చేశారు.

బాలయ్య తన ప్రేమ విషయాన్ని ఇంట్లో కూడా చెప్పారు. అయితే ఇది ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇష్టం లేదు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సోదరుడు దివంగత హరికృష్ణ రంగంలోకి దిగి కుష్బూకు వార్నింగ్ ఇవ్వటంతో ఆమె మళ్ళీ బాలయ్య వైపు తిరిగి చూడలేదని అంటారు. అదే టైంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో బాలయ్య ప్రేమ వివాహం ఎన్టీఆర్ కి కూడా ఇష్టం లేదని అంటారు.

కారణం ఏదైనా హరికృష్ణ రంగంలోకి దిగి ఈ మేటర్ ను సెటిల్ చేయటంతో కుష్బూ మళ్ళీ బాలయ్య వైపే చూడలేదు. ఆ వెంటనే ఎన్టీఆర్.. బాలయ్యకు కాకినాడకు చెందిన వసుంధర దేవికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి తర్వాత కూడా బాలయ్య, విజయశాంతి బంధం పై చాలా రూమర్లు వచ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news