Newsర‌ష్మిక‌, శ్రీలీల కాదు... ఇప్పుడు టాలీవుడ్‌లో ఆ హీరోయిన్ హాట్ టాపిక్‌..!

ర‌ష్మిక‌, శ్రీలీల కాదు… ఇప్పుడు టాలీవుడ్‌లో ఆ హీరోయిన్ హాట్ టాపిక్‌..!

ప్రతి హీరోయిన్‌కు ఒక టైం వస్తుందంటారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్కువ కాలం ఛాన్సులు రావు. వారు ఫామ్‌లో ఉన్నప్పుడు ఐదారేళ్లలోనే ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ డబ్బులు వెనకేసుకోవాలి. నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు హీరోయిన్లకు మాత్రమే 15 సంవత్సరాల లాంగ్ కెరీర్ ఉంటుంది. మిగిలిన హీరోయిన్లకు అంత సీన్ ఉండదు. ఇక టాలీవుడ్ లో మొన్నటి వరకు పూజ హెగ్డే టైం నడిచింది. స్టార్ హీరోలు, దర్శకులు అందరూ పూజ వెంట పడ్డారు.

ఆ తర్వాత రష్మిక వంతు వచ్చింది. ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ వెంటనే వరుసపెట్టి నితిన్, మహేష్ బాబు, బన్నీ లాంటి స్టార్ హీరోలతో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. అసలు టాలీవుడ్ మొత్తం రష్మిక వెంటే పడింది. విజయ్ దేవరకొండ – రష్మిక వరుసగా తన సినిమాలలో రిపీట్ చేసి హిట్లు కొట్టారు. ఈ క్రేజ్‌తో బాలీవుడ్ లో ఛాన్సులు వచ్చాయి. ఇక ఇప్పుడు శ్రీలీల హవా నడుస్తోంది.శ్రీలీల నటించిన సినిమాలు సగటున నెలకు ఒకటి రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి.

అలాంటి టైం లో ఇప్పుడు శ్రీలీల, రష్మికతో పోటీగా మరో హీరోయిన్ కూడా లైమ్ లైట్‌లోకి వచ్చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ? ప్రియాంక మోహన్. ఈ ముద్దుగుమ్మ వరస పెట్టి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఓజీ సినిమాలో నటిస్తోంది ప్రియాంక మోహన్. ఈ సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. అంతలోనే నాని సరసన సరిపోదా శనివారం సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. గతంలో ఆమె నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. ఆ టైంలోనే నాని ఆమెకు మరో ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు నిలబెట్టేసుకున్నాడు.

ఇప్పుడు రవితేజ సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా ఎంపికయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ముందుగా రష్మికను హీరోయిన్ అనుకున్నారు. ఆమె డేట్లు సర్దుబాటు చేయలేక తప్పుకోవటంతో ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ ప్రియాంక మోహన్ ను వరించింది. నిన్న మొన్నటి వరకు అసలు ప్రియాంక మోహన్ పేరు టాలీవుడ్ లో వినిపించలేదు. గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాలు ప్లాప్ అయ్యాక ఆమె పూర్తిగా కోలీవుడ్‌కి పరిమితమైంది. ఇప్పుడు ఒక్కసారి తెలుగులో వరుస పెట్టి పెద్ద సినిమాలలో ఆఫర్లు అందుకుంటుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ప్రియాంక హ‌వా మొదలైనట్టే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news