Newsమ‌నోజ్ త‌న భార్య‌ను ముద్దుగా అలా పిలుస్తాడా... వావ్‌..!

మ‌నోజ్ త‌న భార్య‌ను ముద్దుగా అలా పిలుస్తాడా… వావ్‌..!

టాలీవుడ్‌లో మంచు మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్. మనోజ్ ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా హీరోగా ఇప్పటికీ తనదైన ముద్ర వేయలేకపోయాడు. రీసెంట్గా నంద్యాల జిల్లాకు చెందిన బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన భూమా వారి ఆడపడుచు మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న మనోజ్ ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెరపై బిజీ అవుతున్నారు. ఈటీవీ విన్ ఓటీటీ యాప్ లో ఒక షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న మనోజ్ అటు వైవిధ్యమైన కథలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

తాజాగా తన భార్య మౌనిక రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడంతో పాటు మౌనిక ముద్దు పేరు సీక్రెట్ బయట పెట్టాడు. తాను తన భార్యను మున్నీలు అని ప్రేమగా పిలుస్తానని మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. “ప్రియమైన మున్నీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ మనోజ్ తన భార్య మౌనికపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.” నా జీవితంలో ప్రేమ వెలుగులు పంచింది మౌనికా అని చెప్పుకొచ్చాడు.

మౌనికను, నన్ను కలిపిన కాలానికి తాను ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా మనోజ్ కామెంట్ చేశాడు. మౌనిక నవ్వులను పంచిందని, నిస్వార్ధమైన ప్రేమను చూపించే కేరింగ్ మాటల్లో చెప్పలేనని మనోజ్ వెల్లడించాడు. మౌనిక ధైర్యం నా జీవితంలోకి రావడం నా లక్ అని మనోజ్ చెప్పుకొచ్చాడు. మౌనిక తన చుట్టూ ఉన్న వాళ్ళందరి ముఖాల్లోనూ చిరునవ్వు తీసుకొస్తుంది అని కూడా చెప్పాడు. నాకున్న కోరిక ఒకటేనని ఎల్లప్పుడూ మౌనిక సుఖసంతోషాలతో ఉండాలని అంటూ మనోజ్ కామెంట్ చేశాడు.

మౌనికకు అంతా మంచి జరగాలి మై లవ్ “అంటూ మనోజ్ చెప్పాడు. తాను ఎప్పటికీ మౌనికపై ప్రేమను కురిపిస్తూనే ఉంటానని మనోజ్ వెల్లడించాడు. మౌనిక ఆనందమే నాకు కావాల్సింది .దాని కోసం నేనేమైనా చేస్తాను. ఎంతవరకైనా వెళ్తానని మనోజ్ చెప్పాడు. మనోజ్ తన భార్యను ఇంతగా ఆకాశానికి ఎత్తేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news