News' భ‌గవంత్ కేస‌రి ' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇంత...

‘ భ‌గవంత్ కేస‌రి ‘ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇంత త్వ‌ర‌గానా…!

ఈ దసరాకు మూవీ లవర్స్ కి, ట్రేడ్ వర్గాలకి ఇచ్చిన ట్రీట్ మామూలు రేంజ్ కాదని చెప్పాలి. నందమూరి బాలకృష్ణ భగవంత్‌ కేసరి – మాస్ మహారాజు రవితేజ టైగర్ నాగేశ్వరరావు – తమిళ స్టార్ హీరో విజయ్ లియో సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కాసుల కనకవర్షం కురిసింది. ఈ మూడు సినిమాల్లో లియో ఫ‌స్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక భగవంత్ కేసరి సినిమా 10 రోజులు ముగిసేసరికి బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయిపోయింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోయినా ఆ సినిమాకు వచ్చిన టాక్ తో పోలిస్తే మంచి వసూలు వచ్చాయని చెప్పాలి.

అయితే లాంగ్ రన్ లో బాలయ్య – రవితేజ సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. ఓవరాల్ గా దసరా మొత్తాన్ని బాలయ్య బాబు భారీ లీడ్ తీసుకుని భగవంత్ కేసరి సినిమాతో క్లీన్ హిట్ కొట్టారు. ఈ సినిమా మొదటి పది రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రు. 125 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రు. 60 కోట్లకు పైగా షేర్ సాధించి సక్సెస్ అయింది. ఈ సినిమాతో బాలయ్యకు వరుసగా మూడో విజయం దక్కినట్లయింది.

ఈ సినిమాకు మ‌రో రెండు వారాల పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సాలిడ్ ర‌న్ ఉంటుంద‌నే చెప్పాలి. ఇక ఈ సినిమా థియేట‌ర్ల‌లో స్ట్రాంగ్‌గా ఉన్న‌ప్పుడే ఓటీటీ డేట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. వ‌చ్చే నెల 23న ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్టు స‌మాచారం. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ వెర్ష‌న్ల‌లో కూడా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుంద‌ట‌. ఏదేమైనా బాల‌య్య హిట్ సినిమా చాలా త్వ‌ర‌గానే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న‌ట్టే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news