Newsఅఖండ టు బాబి సినిమా... డ‌బుల్ దాటేసిన బాల‌య్య రెమ్యున‌రేష‌న్‌... కొత్త...

అఖండ టు బాబి సినిమా… డ‌బుల్ దాటేసిన బాల‌య్య రెమ్యున‌రేష‌న్‌… కొత్త లెక్క ఇదే..!

సినిమాలు హిట్ కావటమే ఆలస్యం హీరోల రెమ్యూనరేషన్లు గట్టిగా పెరిగిపోతూ ఉంటాయి. తెలుగు హీరోల రెమ్యూనరేషన్లు చాలా అంటే చాలా స్పీడ్ గా పెరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే తెలుగు హీరోల రెమ్యూనరేషన్లు ఆ హీరో నటించిన సినిమాలు హిట్ అయినా పెరుగుతున్నాయి.. ఫ్లాప్ అయినా పెరుగుతున్నాయి. ఏడు ఎనిమిది ప్లాపులు వరుసగా వచ్చినా కూడా రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. అలాంటిది వరుసగా హిట్లు ఇస్తున్న నట‌సింహం బాలయ్య రెమ్యున‌రేషన్ ఎందుకు ? పెరగదు అంటే ఆయన పూర్తిగా నిర్మాతల హీరో.

తన సినిమా వల్ల‌ నిర్మాత నష్టపోకూడదు. ఒక రూపాయి లాభం రావాలి.. వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలి.. అనుకునే మనస్తత్వం బాలయ్యది. అఖండ సినిమా విడుదలకు ముందు వీరసింహారెడ్డి ఓకే చేశారు. అప్పటికే జస్ట్ రూ.8 -రూ.10 కోట్ల మధ్యలో మాత్రమే రెమ్యున‌రేష‌న్ ఉంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఇది చాలా రీజనబుల్. బాలయ్య లాంటి స్టామినా ఇమేజ్ ఉన్న వ్యక్తికి ఇది చాలా తక్కువ అనుకోవాలి.

అఖండ హిట్ కావడంతో వీరసింహారెడ్డి రమ్యునరేషన్ రూ.14కోట్ల‌కు పెరిగింది. అది కూడా నిర్మాతలు ఆ సినిమాకు జరిగిన బిజినెస్ నేపథ్యంలో ముందుగా అనుకున్న రెమ్యూనరేషన్ కంటే నాలుగు కోట్లు పెంచి ఇచ్చారు. అది కూడా బాలయ్య అడిగి తీసుకుంది కాదు.. అప్పటికే ఒప్పుకున్న సినిమా భగవంత్‌ కేసరి. ఆ సినిమాకు రూ.14 కోట్లు అనుకున్నారు. వీర సింహారెడ్డి సూపర్ హిట్ అయ్యాక దానిని రూ.18 కోట్లకు ఫైనల్ చేశారు. అది కూడా నిర్మాతలు ఇష్టప్రకారమే జరిగింది. ఇప్పుడు లేటెస్ట్‌గా బాబీతో బాలయ్య నటించే 109వ సినిమాకు బాలయ్య రెమ్యున‌రేష‌న్ రూ.28 కోట్లు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

బాలకృష్ణకు రూ.28 కోట్ల రెమ్యున‌రేష‌న్ అన్న‌ నిర్మాతలు హ్యాపీనే. బాలయ్యకు సరైన డైరెక్టర్ కాంబినేషన్ పడితే రూ.150 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోంది. నిజానికి రూ.150 కోట్ల బిజినెస్ లేని చాలామంది హీరోలు తెలుగులో రూ.25 కోట్లు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నాని, రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి హీరోల రెమ్యూనరేషన్ ఇప్పుడు రూ.25 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి. మరి ఆ హీరోల మార్కెట్ బాలయ్య మార్కెట్ కంపేరిజన్ చేసి చూస్తే బాలయ్య తీసుకుంటున్నది చాలా చాలా రీజనబుల్ అని చెప్పాలి.

సీనియర్ హీరోల్లో పవన్ కళ్యాణ్ రూ.60 కోట్లకు పైనే తీసుకుంటున్నారు. పవన్ రేంజ్ కు తగినట్టుగా ఎప్పుడూ వసూళ్లు రావటం లేదు. మెగాస్టార్ రూ.50 నుంచి రూ.55 కోట్ల మేర తీసుకుంటున్నారు. మరి బాలయ్యకు రూ.28 కోట్లు అంటే చాలా తక్కువనే చెప్పాలి. ఇక సీనియర్ హీరోలలో రవితేజ రూ.24 కోట్ల రేంజ్ లో ఉన్నారు. వెంకీ రూ.10 కోట్ల దగ్గరలో ఉన్నారు. నాగార్జున ఇంకా రూ.10 లోపే ఉన్నారని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news