News' భ‌గ‌వంత్ కేస‌రి ' హిట్‌... చిరంజీవిని బాల‌య్య ఎంత టెన్ష‌న్‌లో...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ హిట్‌… చిరంజీవిని బాల‌య్య ఎంత టెన్ష‌న్‌లో పెట్టాడంటే..!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ తన కెరీర్లో 155 సినిమాలు పూర్తి చేశారు. తన కెరీర్లో ఎన్నో రికార్డులు సృష్టించారు. చిరంజీవికి ఒత్తిడి అనేది కొత్త కాదు.. గతంలో సినిమాలు ప్లాప్ అయినప్పుడు ఎన్నోసార్లు ఆయన ఒత్తిడికి గురయ్యారు. ఒక్కసారిగా పుంజుకుని సూపర్ డూపర్ హిట్లు కొట్టి తాను ఎప్పటికీ మెగాస్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు కాలం మారింది. కుర్రాళ్లతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం చిరంజీవి తన కెరీర్ లోనే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారనేది వాస్తవం.

ఇప్పటికే ఆయన వయసు 67 దాటుతోంది. తన వయసు హీరోలు కమలహాసన్ విక్రమ్ – రజనీకాంత్ జైలర్ సినిమాల‌తో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ఈ వయసులోనూ వారు కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ తమ ఆధిపత్యం చాటుకుంటున్నారు. అయితే ఇక్కడ చిరంజీవిని వరుసగా ప్లాపులు ప‌ల‌క‌రిస్తున్నాయి. ఇవి ఆయనను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 ఒక మోస్త‌రుగా ఆడింది. అది కూడా రీమేక్‌ సినిమా ఆ తర్వాత చేసిన సైరా – గాడ్ ఫాదర్ – ఆచార్య – భోళాశంకర్ భయంకరమైన డిజాస్టర్లు. ఒక వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే హిట్ అయింది.

అయితే చిరంజీవికి ఇటు వరుసగా ప్లాపులు వస్తున్న టైం లో తన కెరీర్ ప్రారంభం నుంచి చిరంజీవికి సినీరంగంలో ప్రత్యర్థిగా ఉన్న మరో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ వరుసగా సూపర్ హిట్లు కొడుతూ చిరంజీవిని బాగా ఒత్తిడిలోకి నెట్టేశారు అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఇండస్ట్రీలో చిరంజీవి – బాలకృష్ణ మధ్య పోటీ, ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎవరిని అడిగినా దశాబ్దాల కాలంగా వీరి బాక్సాఫీస్ వైరం గురించి కథలుగా చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య పోరులో బాలయ్య ముందంజలో ఉండడంతో పాటు చిరంజీవిపై పూర్తి పై చేయి సాధించి దూసుకుపోతున్నారు.

గత నాలుగేళ్లలో చిరంజీవి ప్లాపులే ఎక్కువ ఇచ్చారు. భోళాశంకర్ సినిమా డిజాస్టర్ అవ్వటం కాదు.. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసింది. భగవంత్‌ కేసరి సినిమా యావరేజ్ అన్నారు. కానీ ఇప్పుడు వారం రోజులు పూర్తయ్యేసరికి అదిరిపోయే కలెక్షన్లతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య సినిమా లైన‌ప్‌ చాలా బాగుంది. అదే టైంలో చిరంజీవి ఎంపిక‌ చేసుకుంటున్నా దర్శ‌కులు జాబితా అంత స్ట్రాంగ్ గా ఏమీ లేదు. అందుకే ఆయన కొరసాల కళ్యాణకృష్ణను పక్కన పెట్టేశారు. ఎన్నో లెక్కలు వేసుకుని మరి బింబిసారా దర్శకుడు మల్లిడి వశిష్టకు అవకాశం ఇచ్చారు.

ఇది సోషియో ఫాంట‌సీ సినిమా. దీనికి రు. 200 కోట్లు బ‌డ్జెట్ అవుతోంది. ఈ సినిమా క‌థ ఎంపిక చేసుకునే విష‌యంలో కూడా చిరంజీవి బాల‌య్య వ‌రుస హిట్ల నేప‌థ్యంలో బాగా ఒత్తిడికి గుర‌య్యి.. త‌న‌కు స‌న్నిహితులుగా ఉన్న ఐదారుగిరికి క‌థ చెప్పి వారు ఓకే అన్నాకే ఈ సినిమాకు ఓకే చెప్పిన‌ట్టు టాక్ ? అయితే ఈ సినిమా యేడాది పాటు షూటింగ్ జ‌రుపుకోనుంది. 2025 సంక్రాంతికి అంటున్నారు. ఈ లోగా బాల‌య్య – బాబి సినిమాతో పాటు మ‌రో సినిమా కూడా రిలీజ్ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఏదేమైనా బాల‌య్య వ‌రుస హిట్లు చిరును డిఫెన్స్‌లో ప‌డేశాయ‌న్న మ్యాట‌ర్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో బాగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news