Moviesభగవంత్ కేసరి త్రీ డేస్ కలెక్షన్స్: బాలయ్య మాస్ ఊచ కోత.....

భగవంత్ కేసరి త్రీ డేస్ కలెక్షన్స్: బాలయ్య మాస్ ఊచ కోత.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

భగవంత్ కేసరి ..భగవంత్ కేసరి ..భగవంత్ కేసరి .. ఇప్పుడు ఎక్కడ చూసినా .. ఎవ్వరి నోట విన్న ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా బాలయ్య సెంటిమెంటల్ పాత్రలో కనిపించడం సినిమాకు మరింత హైప్ ని ఇచ్చింది . భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య నటన సూపర్ డూపర్ గా ఉంది అంటూ జనాలు ప్రశంసిస్తున్నారు . అంతేకాదు అనిల్ రావిపూడి చాలా సాహసమైన డైరెక్షన్ చేశారు అని పొగిడేస్తున్నారు.

అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా జనాలను తెగ మెప్పించేసింది . ఈ క్రమంలోనే హిట్ టాక్ తో దూసుకుపోతుంది . రికార్డులు పరంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. తాజాగా భగవంత్ మూడో రోజు కలెక్షన్స్ ను రివిల్ చేసింది టీం . ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా 71.2 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది .

అసలు దీనికి పెట్టిన బడ్జెట్ 60 కోట్లుగా తెలుస్తుంది. అలా చూసుకుంటే ఈ చిత్రం లాభాల బాట పట్టినట్లే. అంతే కాదు 100 కోట్ల వైపు దూసుకెళ్లిపోతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .దీంతో బాలయ్య కెరియర్లో మరో బిగ్గెస్ట్ హిట్గా భగవంత్ కేసరి నిలిచింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news