Moviesసినీ ఇండస్ట్రీలోకి మెగా కోడలు పిల్ల.. ఉపాసన సంచలన నిర్ణయం..!?

సినీ ఇండస్ట్రీలోకి మెగా కోడలు పిల్ల.. ఉపాసన సంచలన నిర్ణయం..!?

ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ..ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా అటువంటి చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . కాగా ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు కూడా అంతే స్థాయిలో సక్సెస్ అయ్యారు . కాగ రీసెంట్గా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది .

మెగా కోడలు ఉపాసన త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మెగా కోడలు ఉపాసన ఓ సొంత ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయబోతుందట . ఇప్పటికే నిహారిక – సుస్మిత – రామ్ చరణ్ కి సంబంధించిన ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి . అయితే ఉపాసన సైతం మరో ప్రొడెక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధపడుతుందట .

అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ లో కేవలం కొత్త వాళ్లకి మాత్రమే ఛాన్స్ ఉంటుందట. వాళ్లని ఎంకరేజ్ చేసేలా మాత్రమే ఉపాసన ఈ నిర్ణయం తీసుకుందట. ఎవరైతే టాలెంట్ ఉన్నా కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతున్నారో..వాళ్ల కోసం మాత్రమే ఉపాసన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . మెగా ఫ్యామిలీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news