Moviesక‌ళ్యాణ్‌రామ్ ' డెవిల్ ' నుంచి సంయుక్త పోస్ట‌ర్ రిలీజ్‌… అంతు...

క‌ళ్యాణ్‌రామ్ ‘ డెవిల్ ‘ నుంచి సంయుక్త పోస్ట‌ర్ రిలీజ్‌… అంతు చిక్క‌ని టాప్ సీక్రెట్‌..!

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న సినిమా డెవిల్. పిరియాడిక్ స్పై థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అన్న ట్యాగ్లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కళ్యాణ్‌రామ్ కి జోడిగా సంయుక్త మీద నటిస్తోంది.

సంయుక్త – కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన బింబిసార సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సోమవారం సంయుక్త పుట్టినరోజు సందర్భంగా డెవిల్ సినిమాలో ఆమె పోషించిన నైషధ‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సంయుక్త కొబ్బరికాయ .. పువ్వులు తీసుకుని గుడిలో పూజకు వెళుతున్న అమ్మాయిగా ప్లెజెంట్ లుక్ లో ఆకట్టుకుంటుంది.

పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కిన డెవిల్ సౌత్ ఇండియా భాషలతో పాటు హిందీలో నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇక డెవిల్ సినిమాలో కళ్యాణ్రామ్ ఎవరికీ అంతుచిక్కని ఓ రహస్యాన్ని చేధించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా ఆకట్టు కోబోతున్నాడు. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో, సినీ అభిమానులలో మామూలు అంచనారు లేవు. అభిషేక్ పిక్చర్స్ నామా అభిషేక్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news