Moviesషాకింగ్‌: అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది…!

షాకింగ్‌: అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది…!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జులాయి – సన్నాఫ్ సత్యమూర్తి – అల వైకుంఠపురంలో లాంటి మూడు సూపర్ హిట్ సినిమాల‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రారంభమవుతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు ? ప్రారంభమవుతుంది అంటూ బన్నీ – త్రివిక్ర‌మ్‌ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో సహజంగానే ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు ఉన్నాయి.

ఈ క్రేజీ ప్రాజెక్టు 2024 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని.. 2025 సంక్రాంతి కనుక ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో బన్నీ పాత్రను కూడా త్రివిక్రమ్ చాలా కొత్తగా డిజైన్ చేసినట్టు సమాచారం.

ఏది ఏమైనా త్రివిక్రమ్ – బన్నీ తమ కాంబినేష‌న్‌లో నాలుగో సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ సినిమా టైటిల్.. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ – గీతా కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news