Moviesచిరంజీవి సినిమాల లైన్ మారిపోయిందే…!

చిరంజీవి సినిమాల లైన్ మారిపోయిందే…!

మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి రెండు సినిమాలు ప్రకటించారు. వీటిలో ఒక సినిమాను తన కూతురు కొణిదల సుష్మిత నిర్మాణ సారధ్యంలో చేస్తారు. మరో సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చేస్తారు. ఈ రెండు సినిమాలకు సంబంధించి అధికారిక‌ ప్రకటనలు కూడా వచ్చేసాయి. ఇక తన సినిమాల ఆర్డర్ కూడా చిరంజీవి ఇచ్చేసారు.

కూతురుకు చెందిన గోల్డ్ బాగ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చేయబోతున్న సినిమా 156 వ‌ సినిమా కాబోతుందని.. ఆ తర్వాత 157వ సినిమాగా యూవీ క్రియేషన్ సినిమా వస్తుందని స్పష్టం చేశారు. అయితే ముందుగా చిరంజీవి 157 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో చాలామంది అనుమానం వ్యక్తం చేశారు.

చిరంజీవి సినిమాల ఆర్డర్ మారుతుందని భావించారు కానీ అలా జరగటం లేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కే సినిమాకు బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తారు. ఇదో ఫాంటసీ అడ్వెంచర్స్ మూవీ. ఈ సినిమాకు భారీగా గ్రాఫిక్స్.. సెట్స్ అవసరం. అందుకే ఈ సినిమాకు కాస్త ముందుగానే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు.

ప్రీ ప్రొడక్షన్ పనులు.. సెట్ వర్క్‌, గ్రాఫిక్ డిజైన్ ముగిసేలోపు చిరంజీవి తన 156 వ సినిమాను పూర్తి చేస్తారు. ఇక చిరు కూతురు నిర్మాతగా చిరంజీవి చేయబోయే సినిమాకు కూడా స్క్రిప్ట్ లాక్ అయింది. కురసాల కళ్యాణ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news