Moviesనమ్రతకు కోపం వస్తే అలిగి ఎక్కడికి వెళ్తుందో తెలుసా..? ప్రతి భర్తకి...

నమ్రతకు కోపం వస్తే అలిగి ఎక్కడికి వెళ్తుందో తెలుసా..? ప్రతి భర్తకి ఇలాంటి భార్యే అవసరం..!!

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్న అందరికీ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తూ ఉంటుంది టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఆయన భార్య నమ్రత. వీళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . వంశీ సినిమా షూటింగ్లో భాగంగా ఇద్దరు కలుసుకున్నారు . లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ప్రేమలో పడిపోయారు. కాగా ఇద్దరు చూసి చూడంగానే ప్రేమించేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఐ లవ్ యు చెప్పుకొని ఒకరి లవ్ ని ఒకరు యాక్సెప్ట్ చేశారు .

కాగా ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయిన ఈ జంట ఇప్పుడు ఇద్దరు పిల్లలతో లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది . కాగా అందరి భార్యాభర్తల్లాగా వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు . కాగా చాలామంది భార్యలు భర్తలపై గొడవపడి పుట్టింటికి అలిగి వెళ్లిపోతూ ఉంటారు . కానీ మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం అలా కాదు . భర్త పై ఏమాత్రం కోపం వచ్చినా.. అలిగిన వెంటనే హ్యాండ్ బ్యాగ్ తీసుకొని షాపింగ్ కి వెళ్ళిపోతుందట .

మొదటి నుంచి ఆమెకు అదే అలవాటు. ఇప్పటికీ ఎన్నోసార్లు అలా మహేష్ బాబు పై కోపంతో చెప్పకుండా షాపింగ్ కి వెళ్ళిన సందర్భాల్లో ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఈ క్యూట్ జంట పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news