Moviesఎంత మంచి మ‌న‌సు…. హ్యాట్సాఫ్ విజ‌య్ దేవ‌ర‌కొండ… !

ఎంత మంచి మ‌న‌సు…. హ్యాట్సాఫ్ విజ‌య్ దేవ‌ర‌కొండ… !

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. సమంత హీరోయిన్గా నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి. చాలా గ్యాప్‌ తర్వాత విజయ్ తన ఖాతాలో ఒక సూపర్ హిట్ వేసుకున్నాడు. ఇటు సమంత కూడా వరుస ప్లాపుల తర్వాత ఖుషి సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఇప్పటికే రు. 70 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న ఖుషి మరో రెండు రోజుల్లో 100 కోట్ల మార్కు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

అటు అమెరికాలో 1.5 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ చేసిన ఓ మంచి పని ఇప్పుడు అతడి ఉదార మనస్తత్వాన్ని చాటి చెబుతోంది. కోవిడ్ సమయంలో విజయ్ దేవరకొండ వినూత్న సేవా కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత భవిష్యత్తులో యువతకు అండగా ఉండాలని చేసిన కొన్ని పనులు కూడా ప్రశంసలు అందుకున్నాయి. తర్వాత తన ఆర్గాన్స్ అని డొనేట్ చేసి ఎంతోమందికి విజయ్ ప్రేర‌ణ‌గా నిలిచాడు.

మరోసారి విజయ్ తన గొప్ప మనసు చాటుకుని అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఖుషి సినిమా హిట్ అయిన సందర్భంగా ఆ సినిమాకి వచ్చిన వసూళ్ల నుంచి ఒక కోటి రూపాయలను తన దేవర కుటుంబాలకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున సాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇది నా రియల్ సక్సెస్ ల భావిస్తున్నాను అని.. తన విజయంలో తన కుటుంబాలు అందరికీ భాగస్వామ్యం ఉందని విజయ్ చెప్పటం విశేషం. ఏది ఏమైనా విజయ్ చేసిన ఈ మంచి పనికి సర్వత్ర ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. తాను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన కుటుంబాలు.. బంధువులను విజయ్ ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news