Movies"తెలుగు హీరోలు హీరోయిన్స్ లో అదే చూస్తారు..నాకు ఏమో అది లేదు".....

“తెలుగు హీరోలు హీరోయిన్స్ లో అదే చూస్తారు..నాకు ఏమో అది లేదు”.. ఐశ్వరయ రాజేష్ సంచలన కామెంట్స్ వైరల్..!!

రీజన్ ఏంటో తెలియదు కానీ అల్లాటప్ప హీరోయిన్స్ కి మన తెలుగు హీరోలు ఛాన్స్ ఇవ్వరు . ఇది నిజం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పాన్ ఇండియా హీరో అయినా కచ్చితంగా ఆ హీరోయిన్ మార్కెట్ రేట్ ని చూస్తారు . అప్పుడే అవకాశాలు ఇస్తారు . ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్ . కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈమె తద్వారా వచ్చిన పాపులారిటీతో తెలుగులో కూడా పలు సినిమాలో నటించింది .

జనాలకు ఈమె నటించే సినిమాలు నచ్చుతున్న తెలుగు హీరోలకు మాత్రం నచ్చడం లేదు. అదేంటో తెలియదు కానీ ఒక్కరంటే ఒక్క హీరో కూడా అమ్మడుకు ఛాన్స్ ఇవ్వట్లేదు. సాయిధరమ్ తేజ్ లాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చిన .. ఆ సినిమాలు పెద్దగా ఆడడం లేదు . అయితే ఇదే విషయంపై ఐశ్వర్యరాజేష్ స్పందిస్తూ..” తెలుగు హీరోలు మార్కెట్ ఉన్న హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటారని ..నాలాంటి హీరోయిన్స్ కి మార్కెట్ ఉండదని”..చాలా ఓపెన్ గానే చెప్పుకొచ్చింది.

” వాళ్ళు చూస్ చేసుకోన్నంత మాత్రాన నష్టం ఏమీ లేదని .. తాను సింగిల్గానే నటించి హిట్ కొడతానని ..”కూసింత ఘాటుగానే స్పందించింది. దీంతో మరోసారి ఐశ్వర్య రాజేష్ పేరు తెలుగు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news