Moviesప‌వ‌న్ హీరోయిన్ సుప్రియ దెబ్బ‌తో స్టార్ హీరో, స్టార్ డైరెక్ట‌ర్ మ‌ధ్య...

ప‌వ‌న్ హీరోయిన్ సుప్రియ దెబ్బ‌తో స్టార్ హీరో, స్టార్ డైరెక్ట‌ర్ మ‌ధ్య మాట‌ల్లేనంత ప‌గ‌…!

యార్లగడ్డ సుప్రియ అంటే చాలామంది త్వరగా గుర్తుపట్టకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరోయిన్ నాగార్జున మేనకోడలు సుప్రియ అంటే అందరూ ట‌క్కున గుర్తుపట్టేస్తారు. తొలి సినిమాతోనే ఏకంగా పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించే ఛాన్స్ దక్కించుకున్న సుప్రియ చాలా ఏళ్ల తర్వాత గూడచారి సినిమాలో కీలక పాత్ర ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక ఆమె మళ్ళీ ఈ తరం జనరేషన్ ప్రేక్షకులకు కాస్త కనెక్ట్ అయ్యింది.

సుప్రియ లెజెండ్రీ హీరో ఏఎన్నార్ కుమార్తె సత్యవతి కూతురు సుప్రియ సోదరుడు మ‌రి ఎవరో కాదు హీరో సుమంత్. అయితే చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో సుప్రియ- సుమంత్ ఇద్దరు ఏఎన్నార్ పర్యవేక్షణలోనే పెరిగారు. అయితే సుప్రియ తొందరపాటు చర్య వల్ల ఏఎన్నార్ కు స్టార్ డైరెక్టర్ దాసరికి మధ్య మాటలు లేనంత పగ పంతాలు పెరిగిపోయాయి. అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు సుప్రియ పర్యవేక్షణలో జరిగేవి.

దాసరి దర్శకత్వంలో తెర్కెక్కిన ఒక సినిమాకు అద్దె కట్టే విషయంలో సుప్రియ నేరుగా దాసరిని స్టూడియోలో రెంట్ అద్దె విషయం మై ప్రశ్నించారట.అయితే దీనిపై ఏఎన్ఆర్ స్పందిస్తూ స్టూడియో వ్యవహారాలు అన్ని ఆమె చూసుకుంటుందని చెప్పడంతో దాసరికి బాగా కోపం వచ్చింది.. అలా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఈగో పెరిగిపోయింది. చివరకు నిర్మలమ్మ చనిపోయినప్పుడు ఒకే టైంలో దాసరి- ఏఎన్ఆర్ అక్కడికి వెళ్లారు. దాసరిని చూసిన ఏఎన్ఆర్ నిర్మలమ్మా ఇంటి వెనుక రెండో గెట్టు నుంచి వెళ్లిపోయారట.

అలాగే ఏఎన్ఆర్ సతీమణి అన్నపూర్ణమ్మ చనిపోయినప్పుడు దాసరి పరామర్శకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు నాగార్జునకి ఫోన్ చేసి తాను వస్తున్నాను అని చెప్పగా గురువుగారు రండి అని చెప్పిన నాగార్జున అయిదు నిమిషాల తర్వాత ఫోన్ చేసి గురువుగారు ఇప్పుడు నాన్నగారు ఎవరితో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు రెండు రోజులు ఆగి వదురు గాని అన్నీ చెప్పారట. అలా ఆ ఇద్దరి మధ్య ఆ స్థాయిలో పంతం పెరిగిపోయింది. వీరిద్దరూ చనిపోయే వరకు కూడా ఇద్దరి మధ్య స్నేహ వాతావరణం అయితే లేదు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news