Moviesబిగ్ స‌ర్‌ప్రైజ్‌: సెప్టెంబ‌ర్‌లో కాదు ఆగ‌స్టులోనే ప్ర‌భాస్ సినిమా రిలీజ్‌... డేట్...

బిగ్ స‌ర్‌ప్రైజ్‌: సెప్టెంబ‌ర్‌లో కాదు ఆగ‌స్టులోనే ప్ర‌భాస్ సినిమా రిలీజ్‌… డేట్ ఇదే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు వరుసగా భారీ సినిమాలు సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28న సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక సంక్రాంతికి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తనకు ఎక్కుతున్న కల్కి 2898 సినిమా రిలీజ్‌కు షెడ్యూల్ అయి ఉంది.

ఆ తర్వాత సలార్ 2 సినిమాతో పాటు సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్, మారుతి సినిమా, కల్కి పార్ట్ 2 సినిమాలు వరుసగా షెడ్యూల్ అయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా కోసం సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిన పనిలేదు.. ఆగస్టులోనే ప్రభాస్ నటించిన సినిమా వచ్చేస్తోంది.

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ప్రభాస్ కెరియర్లో ప్యూర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా యోగి. వివి. వినాయక్ తెర‌కెక్కించిన ఈ సినిమా అప్పట్లో మిస్స్ ఫైర్ అయ్యింది. నయనతార హీరోయిన్గా నటించింది. అయితే ప్రస్తుతం స్టార్ హీరోల‌ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.

ఈ ట్రెండ్ లో భాగంగా యోగి సినిమాను ఆగస్టు 18న తెలుగు స్టేట్స్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. సడన్గా ఈ సినిమాపై అనౌన్స్మెంట్ వచ్చింది. మరి ఫ్యాన్స్ లో ఈ సినిమా ఎంతవరకు వెళుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news