Moviesఈ ఫొటోలో ఉన్న ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఎవ‌రు… ఈ ఫొటో...

ఈ ఫొటోలో ఉన్న ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఎవ‌రు… ఈ ఫొటో స్పెష‌ల్ ఇదే…!

మెగాస్టార్ చిరంజీవిది – విజ‌య‌బాపినీడుది విజ‌య‌వంత‌మైన కాంబినేష‌న్‌. వీరి కాంబినేష‌న్లో మొత్తం ఆరు సినిమాలు వ‌చ్చాయి. ఇందులో చివ‌ర‌గా వ‌చ్చిన బిగ్‌బాస్ సినిమా మిన‌హా మిగిలిన అన్ని సినిమాలు సూప‌ర్ హిట్‌. ఈ క్ర‌మంలోనే 1986లో విడుదలైన సినిమా మ‌గ‌ధీరుడు. విజయ బాపినీడు దర్శకత్వంలో ‘శ్యాంప్రసాద్ ఆర్ట్స్’ వారి కుటుంబ క‌థా చిత్రంగా మగధీరుడు తెకెక్కింది.

ఈ సినిమా షూటింగ్ టైంలో తీసిన వ‌ర్కింగ్ స్టిల్ పై ఫొటో. ఈ ఫోటోలో హీరో చిరంజీవి, హీరోయిన్ జయసుధ పాటుగా సుహాసిని, సుమలతను కూడా మనం చూడవచ్చును. హీరోయిన్ జయసుధ, సుహాసిని, సుమలతలు సరదాగా షూటింగ్ స్పాట్ గ్యాప్ లో చిరంజీవిని ఆటపట్టిస్తుండ‌గా తీసిన స్టిల్ ఇది. ఆ పక్క స్టూడియోలో సుహాసిని నటించే ‘ప్రెసిడెంట్ గారి అబ్బాయి’ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది.

త‌న షూటింగ్ ప‌క్క‌నే మగధీరుడు షూటింగ్ జరుపుకుంటున్నదని తెలిసిన ఆమె చిరు సినిమా సెట్స్‌లోకి వ‌చ్చింది. అలాగే సుమలత కూడా చిరంజీవి షూటింగ్ అని తెలిసి పలకరింపుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారితో హీరోయిన్ గా జయసుధ కలిసి నటించిన ఏకైక సినిమా మ‌గ‌ధీరుడు. ఇక చిరంజీవి సినిమాకి యస్.పి. బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం చేసిన ఒకేఒక్క సినిమా ఇది. ఈ స్టిల్లో చిరును ఆ ముగ్గురు హీరోయిన్లు ఆట‌ప‌ట్టిండ‌గా ఫొటోగ్రాఫ‌ర్ ఒక్క క్లిక్ మ‌నిపించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news