Movies' బింబిసార ' సెంటిమెంట్‌తోనే ' క‌ళ్యాణ్‌రామ్‌ ' కు డెవిల్...

‘ బింబిసార ‘ సెంటిమెంట్‌తోనే ‘ క‌ళ్యాణ్‌రామ్‌ ‘ కు డెవిల్ హిట్ ..!

బింబిసార సక్సెస్ తో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ మంచి ప్రామిసింగ్ హీరో అయిపోయాడు. ఈ సినిమాతో రు. 50 కోట్ల మార్కెట్ ఉన్న హీరో అయ్యాడు. అయితే ఆ వెంట‌నే ఈ యేడాది ఆరంభంలో అమిగోస్ రూపంలో పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు. దీంతో ఈ హీరో ఇప్పుడు క‌ళ్యాణ్‌ రామ్ ఆశలన్నీ డెవిల్ పైనే ఉన్నాయి. తాజాగా ఈ యేడాది న‌వంబ‌ర్ 24న రిలీజ్ చేస్తున్న‌ట్టు డేట్ ఇచ్చేశారు.

అయితే అమిగోస్ ఎఫెక్ట్ డెవిల్‌పై ఏ మాత్రం లేదు. పైగా త‌న కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ బింబిసార సెంటిమెంట్ కూడా డెవిల్‌కు కలిసొచ్చింది. బింబిసార సినిమాపై కూడా విడుదలకు ముందు ఏ మాత్రం అంచ‌నాలు లేవు. ఎప్పుడు అయితే టీజ‌ర్ రిలీజ్ అయ్యిందో ఒక్క‌సారిగా అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇప్పుడు స‌రిగ్గా డెవిల్ విష‌యంలోనూ అదే జ‌రిగింది.

సినిమా టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ఎవ్వరూ అంచ‌నా వేయ‌లేని క‌థాంశం, టీజ‌ర్‌లో క‌నిపించే స‌రికి సినిమాపై అంచ‌నాలు బాగా పెరిగిపోవ‌డంతో పాటు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఓ టాప్ సీక్రెట్ ఛేదించే కఠినమైన బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటించాడు కళ్యాణ్ రామ్.

ఇక ఈ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు అటు హిందీలో కూడా ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా న‌టించింది. అలా హీరోయిన్ కోణంలో కూడా బింబిసార సెంటిమెంట్ డెవిల్ కు కలిసొచ్చిన‌ట్లు అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news