Moviesఎన్టీఆర్ స్మారక రూ.100 నాణం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ధర ఎంతో తెలుసా..?...

ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ధర ఎంతో తెలుసా..? ఎలా పొందాలంటే..పూర్తి డీటెయిల్స్..!!

దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన వంద రూపాయల స్మారకనాణం ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే . కాగా గతంలో అనేక రకాల నాణేలు తయారు చేసినప్పటికీ ఓ వ్యక్తిగా గుర్తుగా నాణం ని రిలీక్ చేయడం.. ఎన్టీఆర్ దే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది ఈ నాణాన్ని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

ఇదే క్రమంలో ఎన్టీఆర్ వంద రూపాయలు నాణంని మంగళవారం ఉదయం నుంచి విక్రయానికి అందుబాటులో తెచ్చింది గవర్నమెంట్ . ఈ క్రమంలోని 50% వెండి 40 శాతం రాగి ఐదు శాతం జింక్ 5% నికెల్ మిశ్రమంతో ఈ నాణం ని తయారు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది . అంతేకాదు ఒక్కొక్క నాణం ర దాదాపు 3,500 నుంచి 4850 వరకు ఉంది. ఈ నాణన్ని ఆన్లైన్ ద్వారా కానీ ..సచివాలయం వద్ద కానీ మింట్ మ్యూజియం.. చర్లపల్లి లోని మింట్ వద్ద ఏర్పాటు చేసిన సేల్స్ కౌంటర్స్ లో విక్రయానికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది గవర్నమెంట్ .

చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నాణాని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా ప్రస్తుతానికి 12,000నాణాని ముద్రించామని డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేయనున్నట్లు గవర్నమెంట్ ప్రకటించింది . తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ చిత్రంతో వందరూపాయలు కాయిన్ ని చాలా మంది తెలుగువారు కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 100 రూపాయల స్మారక నాణంని మూడు ధరల్లో నిర్ణయించి అధికారులు అమ్ముతున్నారు. రూ. 4,850, రూ. 4,380, రూ. 4,050 గా నిర్ణయించి అధికారులు గిఫ్ట్ బాక్స్ తో ఈ నాణాన్ని అమ్మకాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మకాలు జరిగే ప్రదేశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలల్లో క్యూ కట్టారు. ఈ ఎన్టీఆర్ 100 రూపాయల నాణెంను వ్వ్వ్.ఇందీగొవ్త్మింత్.ఇన్ అనే వెబ్‌సైట్ ద్వారా ఎన్టీఆర్ నాణెంసహా ఇతర మహనీయుల స్మారకార్థం విడుదల చేసిన నాణెలనుకూడా ఈ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news