Moviesబాలయ్య-ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే.. చిన్న రీజన్...

బాలయ్య-ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే.. చిన్న రీజన్ తో లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ఫ్యామిలీ గా పేరు సంపాదించుకున్న నందమూరి కుటుంబం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అంతేకాదు నందమూరి హీరోలుగా పేరు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ – ఎన్టీఆర్ కలసి ఓ సినిమాలో నటిస్తే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక. ఆ కోరిక కలగానే మిగిలిపోకూడదు అని ఓ డైరెక్టర్ రిస్క్ చేశారు . వీళ్లిద్దరి కాంబోలో సినిమా రావడానికి తెగ ట్రై చేశారు . కానీ లాస్ట్ మూమెంట్లు ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది .

కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఆ సినిమాలో నటించి హిట్ చేశాడు. ఆ సినిమా మరేదో కాదు ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బృందావనం . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానుల్ని ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన కూడా టూ గుడ్ అనిపించింది . ఎప్పుడు యాక్షన్స్ ఫైట్ సీన్స్ కాదు ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ లో కూడా నటించే హిట్టు కొట్టగలడు తారక్ అంటూ ప్రూవ్ చేసుకున్నాడు ఈ నందమూరి హీరో .

అయితే ఈ సినిమాలో మొదటిగా ప్రకాష్ రాజ్ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను అప్రోచ్ అయ్యారట వంశీ పైడిపల్లి . కాజల్ తండ్రి పాత్రలో వంశీ పైడిపల్లి బాలకృష్ణను నటింపజేయాలని చాలా ట్రై చేశారట. కానీ అప్పటికే వేరే సినిమాల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ ఈ సినిమాలో నటించలేకపోయాడు . అంతేకాదు “మరో సినిమా కథను రాసి తీసుకొని రా కచ్చితంగా నేను ఎన్టీఆర్ చేస్తామంటూ ప్రామిస్ చేశారట”. చూడాలి మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో.. నందమూరి అభిమానుల తీరని కల ఎప్పుడు నెరవేరుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news