Moviesవిజయ్ కేవలం షర్ట్ మాత్రమే విప్పాడు.. వీడు ఏంట్రా బాబు ఏకంగా...

విజయ్ కేవలం షర్ట్ మాత్రమే విప్పాడు.. వీడు ఏంట్రా బాబు ఏకంగా అదే విప్పేసాడు(వీడియో)..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది . ఒక సినిమాని చాలా సునాయాసంగా తెరకెక్కించేస్తున్నారు డైరెక్టర్లు. అయితే ఆ సినిమాను ప్రమోట్ చేసుకునే విషయంలో మాత్రం డైరెక్టర్ , మేకర్ లు హీరో హీరోయిన్లు పెద్ద సాహసమే చేస్తున్నారు. సినిమాని తెరకెక్కించడం కన్నా ఆ సినిమాని ప్రమోట్ చేయడమే పెద్ద తలనొప్పిగా మారింది. దీని కోసమే రీసెంట్గా విజయ్ దేవరకొండ సమంత కొత్త స్ట్రాటజిని ఫాలో అయ్యారు .

సినిమాలో ఏ విధంగా రొమాన్స్ చేస్తూ వచ్చారో.. అదేవిధంగా స్టేజ్ పై కూడా చేస్తే ఆ సినిమా ఇంకా ప్రమోట్ అవుతుంది అంటూ భావించారు . వాళ్ళు చేసింది తప్పో ఒప్పో తెలియదు కానీ ఇవాళ సినిమా కన్న వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ మరింత స్థాయిలో ప్రమోట్ అయింది . హైలెట్ గా మారింది. ఈ క్రమంలోనే రీసెంట్గా ఖుషి సినిమా ఈవెంట్లో విజయ్ దేవరకొండ సమంత చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే అలా వాళ్ల డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి 24 గంటలు కాకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ అదే స్ట్రాటజిని ఫాలో అయ్యారు . వీళ్లు కలిసి జంటగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ మూవీలోని మొదటి సాంగ్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో రిలీజ్ చేశారు . ఈ పాటలోని ఓ డ్యాన్స్ మూమెంట్ ని వేస్తూ ఏకంగా స్టేజీ పై కొంగుని తీసి తన ఒంటికి చుట్టేసుకుంటాడు విశ్వక్ సేన్. అంతేకాదు ఆ కొంగు నోట్లో పెట్టుకొని ఆమెను రొమాంటిక్ టచ్ చేస్తూ కొన్ని నాటి సీన్ స్టెప్స్ వేస్తాడు . దీంతో స్టూడెంట్స్ ముందు ఇలాంటి స్టెప్స్ ఏంటి ..? అంటూ ఆయనపై మండిపడుతున్నారు. అంతేకాదు మరి కొందరు విశ్వక్ సేన్ చేసిన పనిని తప్పుపడుతున్నారు . విజయ్ కేవలం షర్ట్ మాత్రమే విప్పాడని..నువ్వు ఏకంగా చీర కొంగే తీసేసావు కదా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి రేపటి రోజు ఏ హీరో ఇంకేమీ విప్పుతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news