Movies"మగధీర టైంలో అనుకున్నది.. ఇప్పుడు చేసాడు".. టూ రొమాంటిక్ గా మారిపోయిన...

“మగధీర టైంలో అనుకున్నది.. ఇప్పుడు చేసాడు”.. టూ రొమాంటిక్ గా మారిపోయిన రాజమౌళి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది . మన తెలుగు సినిమా చరిత్రను ప్రపంచ దేశాలు వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకునేలా చేసింది ఎవరు అంటే కళ్ళు మూసుకొని టక్కున చెప్పే పేరు రాజమౌళి . బాహుబలి సినిమాతో అంత గ్రేట్ పేరుని సంపాదించుకున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా కోట్లాదిమంది ఇండియన్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేసిన ఆస్కార్ అవార్డు సైతం తీసుకొచ్చాడు.

కాగా ప్రజెంట్ జక్కన్నకు సంబంధించిన ఏ విషయమైనా సరే గ్లోబల్ స్థాయిలో వైరల్ అవుతుంది. త్వరలోనే మహేష్ బాబు హీరోగా ఓ సినిమాని తెరకెక్కించబోతున్న రాజమౌళి ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను పూర్తి చేశారు . సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు రాజమౌళి . ఇలాంటి టైం లోనే ఫ్యామిలీతో భార్యతో టైం స్పెండ్ చేస్తున్నారు జక్కన్న. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా కొన్ని బ్యూటిఫుల్ లోకేషన్ ఫొటోస్ షేర్ చేసుకున్నారు .

ఈ ఫొటోస్ లో ఆయన భార్య రమ కూడా ఉంది. కాగ రాజమౌళి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన బాహుబలి 1 చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ నార్వే లోని స్టవెంజర్ నగరంలో జరగబోతుంది. దీనికోసం శోభు యార్లగడ్డ, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, రాజమౌళి రమా రాజమౌళి దంపతులు నార్వే వెళ్లారు. అక్కడ ఒక అద్భుతమైన ప్రదేశాన్ని జక్కన్న,రమా రాజమౌళి సందర్శించారు. ఎత్తైన పల్పిట్ రాక్ హిల్ ప్రాంతంలో ప్రకృతి అందాలు వీక్షిస్తూ రాజమౌళి, రమా రాజమౌళి టైం స్పెండ్ చేశారు. ఈ క్రమంలోని అద్భుతమైన ప్రదేశాన్ని రాజమౌళి సందర్శించారు .

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ప్రకృతి అందాలు వీక్షిస్తూ రాజమౌళి , రమ రాజమౌళి టైం స్పెండ్ చేశారు . దీనికి సంబంధించిన పిక్చర్స్ ని సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు . ఎత్తైన ఆ ప్రాంతంలో కూర్చోవడం చాలా భయంకరంగా ద్రిలింగ్ గా ఉంది అంటూ రాజమౌళి రాసుకోచ్చాడు . అంతేకాదు ఈ ప్రదేశానికి వెళ్లాలని రాజమౌళి మగధీర చిత్రం టైంలోనే అనుకున్నారట. కానీ ఇప్పటికి కుదిరింది . మగధీర చిత్రం కోసం లొకేషన్స్ వెతుకుతున్నప్పుడు ఈ రాక్ ఫోటోలు చూశారట. అప్పుడే ఇక్కడికి వెళ్లాలని అనుకున్నారట . కానీ ఇన్ని సంవత్సరాలకి ఆ టైం కుదిరింది అంటూ చెప్పుకొచ్చారు . మొత్తానికి బాహుబలి 1 స్క్రీనింగ్ పుణ్యమా అంటూ రాజమౌళి తన భార్యతో రొమాంటిక్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్నారు . రాజమౌళి -రమా ధైర్యంగా కూర్చుని ఫోటోకి ఫోజులు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news