Moviesప‌వ‌న్ క‌ష్టం ప‌గోడికి కూడా వ‌ద్దు…. రెచ్చిపోయిన శ్రీరెడ్డి

ప‌వ‌న్ క‌ష్టం ప‌గోడికి కూడా వ‌ద్దు…. రెచ్చిపోయిన శ్రీరెడ్డి

కాంట్ర‌వ‌ర్సీ బ్యూటీ శ్రీ రెడ్డి సినిమా ఇండ‌స్ట్రీలో కొంద‌రిని ప‌దే ప‌దే టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తూ వారి అభిమానుల‌ను బాగా రెచ్చ‌గొడుతూ వ‌స్తోంది. ఇక మెగా ఫ్యామిలీని, ద‌గ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేయ‌డంలో ఎప్పుడూ ముందు ఉండే శ్రీ రెడ్డి తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. ప‌వ‌న్ పై కామెంట్లు చేయ‌డంలో శ్రీ రెడ్డి ఎప్పుడూ ఒంటి కాలితో లేస్తూ వ‌స్తోంది.

ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌పై ఎప్పుడూ కామెంట్లు చేసే శ్రీ రెడ్డి తాజాగా మ‌రోసారి ప‌వ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయింది. ప‌వ‌న్ అటు సినిమా… ఇటు రాజ‌కీయాలు రెండిట్లోనూ బిజీబిజీగా గడుపుతూ బ్యాలెన్స్ చేసే విష‌యంలో బాగా మ‌ద‌న ప‌డుతున్నాడ‌ని చెప్పుకొచ్చింది. త‌న కోసం ఇంత‌మంది ఫ్యాన్స్ వ‌చ్చార‌ని సంతోష‌ప‌డాలో లేదా వీళ్లు రేపు త‌న‌కు ఓట్లు వెయ్య‌రు అని బాధ‌ప‌డాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అర్థం కావ‌ట్లేదు పాపం అని కామెంట్ చేసింది.

ప‌వ‌న్‌కు వ‌చ్చిన క‌ష్టం ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దు అని రాసుకొచ్చింది. మ‌రి ప‌వ‌న్ పై శ్రీ రెడ్డి చేసిన కామెంట్ల‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ తీవ్రంగా విరుచుకు ప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news