Moviesబాల‌కృష్ణ కొత్త టాక్ షోకు ప్రొడ్యుస‌ర్ ఎవ‌రు… ఈ సారి ఏ...

బాల‌కృష్ణ కొత్త టాక్ షోకు ప్రొడ్యుస‌ర్ ఎవ‌రు… ఈ సారి ఏ ఓటీటీలో తెలుసా..!

అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో హోస్ట్‌తో స‌రికొత్త బాల‌య్య‌ను తెలుగు ప్రేక్ష‌కులు చూశారు. అస‌లు బాల‌య్య కెరీర్ అన్‌స్టాప‌బుల్ షోకు ముందు.. ఆ త‌ర్వాత అన్న‌ట్టుగా మారిపోయింది. అస‌లు బాల‌య్య ఓ టాక్ షో చేస్తున్నాడ‌న్న ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చిన వెంట‌నే ఇదో ప్లాప్ షో అంటూ జ‌నాలతో పాటు బాల‌య్య‌ను విమ‌ర్శించే వాళ్లు బాగా ట్రోలింగ్ చేశారు.

ఇక ఫ‌స్ట్ సీజ‌న్ కంప్లీట్ అయ్యే స‌రికి బాల‌య్య‌పై విమ‌ర్శ‌లు చేసిన వాళ్ల‌కు నోట మాట ప‌డిపోయిన‌ట్ల‌య్యింది. ఇక అన్‌స్టాప‌బుల్ త‌ర్వాత బాల‌య్య ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు కూడా పిచ్చ‌పిచ్చ‌గా క‌నెక్ట్ అయిపోయాడు. ఎక్క‌డ చూసినా కూడా బాల‌య్య నామ‌స్మ‌ర‌ణ మార్మోగుతోంది. ఇక అన్‌స్టాప‌బుల్ రెండో సీజ‌న్ త‌ర్వాత బాల‌య్య మ‌రింత శిఖ‌రాగ్రానికి చేరిపోయాడు.

అన్‌స్టాబుల్ హోస్ట్‌గా బాల‌య్య త‌న‌దైన శైలి పంచ్‌లు, ప్రాస‌లు, కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. సెల‌బ్రిటీల‌ను ఆయ‌న ప్ర‌శ్న‌లు అడిగిన తీరుపై ప్ర‌శంస‌లు మామూలుగా రాలేదు. ఈ షో సూప‌ర్ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో బాల‌కృష్ణ‌తోనే మ‌రో టాక్ షో ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఆహా ఓటీటీలోనే రానుంది. దీనికి కూడా అల్లు అర‌విందే ప్రొడ్యూస్ చేస్తారు.

బాల‌య్య ప్ర‌స్తుతం న‌టిస్తోన్న భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత ఈ ఓటీటీ షో కోసం డేట్లు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ షో గురించి పూర్తి క్లారిటీ రానుంది. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం న‌టిస్తోన్న భ‌గ‌వంత్ కేస‌రి అక్టోబ‌ర్ 19న ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news