Moviesమెనూ అడిగినందుకే కీర్తి సురేష్ పీక ప‌ట్టుకున్న చిరు... ' భోళాశంక‌ర్...

మెనూ అడిగినందుకే కీర్తి సురేష్ పీక ప‌ట్టుకున్న చిరు… ‘ భోళాశంక‌ర్ ‘ సెట్లో ఇంత జ‌రిగిందా..!

చిరంజీవి న‌టించిన భోళాశంక‌ర్ సినిమా మ‌రో ఆరు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి దిగ‌నుంది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం చిరు లీక్స్ లో భాగంగా కొద్ది రోజుల క్రితం ఓ మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది. అందులో చిరు కోపంగా ఈ సినిమాలో త‌న చెల్లి పాత్ర‌లో న‌టించిన కీర్తిసురేష్ పీక పట్టుకుంటారు. అది సినిమాలో సన్నివేశం కాదు… కానీ సెట్లో నిజంగానే జ‌రిగింద‌ట‌.

అయితే అలా ఎందుకు ? జ‌రిగిందో ఈ రోజు ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూలో చిరు క్లారిటీ ఇచ్చారు. కీర్తికి ప్ర‌తి రోజు చిరు ఇంటి నుంచి భోజ‌నం వ‌చ్చేద‌ట‌. చిరు ఇంట్లో ఉన్న త‌మిళ వంట మ‌నిషి కీర్తికి కావాల్సిన ఐటెంలు అన్నీ చేసి మ‌రీ పంపేవాడ‌ట‌. కీర్తి ఆ ఐటెంలు అన్నీ తిని బాగా ఎంజాయ్ చేసేద‌ట‌. ఒక్కోసారి ఏం కావాలో డిమాండ్ చేయ‌డంతో పాటు ఉప్పు, కారం త‌గ్గితే వెన‌క్కు తిప్పి పంపేద‌ట‌.

ఓ రోజు చిరు షూటింగ్‌లో బిజీగా ఉంటే ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి రేపు మెనూ ఏంటని అడిగింద‌ట‌. చిరు ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ కీర్తి పీక పట్టుకున్నార‌ట‌. ఆ టైమ్ లో తీసిన షాట్ అది అని.. దానినే చిరు లీక్స్‌లో పెట్టిన‌ట్టు చిరు తెలిపారు. ఇక తమన్న మాత్రం తన ఇంటి భోజనం తినేది కాదని… ఆమె భోజనం ప్రత్యేకంగా ఉంటుందని చిరు తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news