Moviesచిరంజీవిలో ఇంత .... ఉంద‌నుకోలేదు... కీర్తి సురేష్ వీడియోపై వ‌ర్మ కాంట్ర‌వర్సీ...

చిరంజీవిలో ఇంత …. ఉంద‌నుకోలేదు… కీర్తి సురేష్ వీడియోపై వ‌ర్మ కాంట్ర‌వర్సీ ( వీడియో)

టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిత్యం ఏదో ఒక అంశంపై ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఏ విషయాన్ని అయినా సరే ముక్కుసూటుగా చెబుతూ విమర్శలకు గురవుతూ ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్మ ఇటీవల ఎక్కువగా మెగా ఫ్యామిలీని.. పవన్ కళ్యాణ్‌ను జనసేన ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

ఇటీవల చిరంజీవి బోళాశంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో హైపర్ ఆది చేసిన కామెంట్లపై వర్మ పరోక్షంగా ఒక అమ్మాయి కాలి గోటికి కూడా భోళా శంకర్ సినిమా సరిపోదని కామెంట్ చేశాడు. ఇక ఈ ఈవెంట్లో చిరంజీవి కీర్తి సురేష్ కు దగ్గరగా ఉండడంతో పాటు.. ఆమెతో చిలిపిగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే మరో హాట్ బ్యూటీ శ్రీరెడ్డి కూడా కాంట్రవర్సీ కామెంట్ చేసింది.

ఇప్పుడు ఇదే వీడియోను వర్మ కూడా షేర్ చేశాడు. అంతేకాకుండా నా ఒక్కడిలోనే ఇంత చిలిపిత‌నం ఉందని నేను అపోహ అపోహ పడ్డాను.. కానీ మీలోనూ ఇంత ఉందని గ్రహించలేకపోయాను అంటూ రాసుకు వచ్చాడు. దీంతో పాటు ఆ వీడియోను కూడా షేర్ చేశాడు. ఇందులో కీర్తి.. చిరంజీవి పక్కనే కూర్చుని ఆయన చేతిని గట్టిగా పట్టుకుని కనిపించింది. వర్మ చేసిన ఈ కామెంట్పై మెగా అభిమానులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news