Moviesవరల్డ్ వైడ్ “ జైలర్ ” డే 1 వసూళ్ల అంచనాలు...

వరల్డ్ వైడ్ “ జైలర్ ” డే 1 వసూళ్ల అంచనాలు … ర‌జ‌నీ సిక్స్ కాదు డ‌బుల్ సిక్స‌రే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమన్నా హీరోయిన్గా తెరకెక్కిన సినిమా జైలర్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. రజిని గత నాలుగైదు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై గట్టి హైప్‌ నెలకొంది.

ఇక టీజర్ ట్రైలర్లతోనే సినిమా ఒక రేంజ్ కు వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే డే వన్ కి భారీ ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూఎస్ లో అయితే కేవలం ప్రీమియర్ షో లతోనే వన్ మిలియన్ డాలర్ల మార్క్ టచ్ చేసింది. ఇక లేటెస్ట్ ప్రిడిక్షన్స్ ప్రకారం ఈ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రు. 80 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్లు అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ రావచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా జైలర్ రజిని కాంత్ రేంజ్ కు తగిన హిట్ ఇస్తుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news