Moviesఅప్పుడు కృతిశెట్టి..ఇప్పుడు శ్రీలీల.. ఈ మెగా హీరో ఏం ఎంజాయ్ చేస్తున్నాడు...

అప్పుడు కృతిశెట్టి..ఇప్పుడు శ్రీలీల.. ఈ మెగా హీరో ఏం ఎంజాయ్ చేస్తున్నాడు రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ట్యాగ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలు వచ్చారు . కానీ కొందరే సక్సెస్ అయ్యారు . కాగా వాళ్ళల్లో ఒకరుగా నిలిచారు పంజా వైష్ణవ తేజ్ . మెగా మేనల్లుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పంజా వైష్ణవ తేజ్ ఉప్పె సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయారు . తొలి మూవీ ఉప్పెనతో సంచలనాన్ని క్రియేట్ చేసిన వైష్ణవ తేజ్ ఆ తర్వాత పలు సినిమాలో నటించినప్పటికీ పెద్దగా ఆకట్టుకో లేకపోయాడు.

చాలా టైం గ్యాప్ తీసుకొని మరి ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ కాన్సెప్ట్ తో మరోసారి అభిమానులు ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్నాడు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా పేరే ఆది కేశవ్. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ సినిమాస్‌ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతుంది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్. మొదట ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్‌ అని చాలా రోజుల క్రితం ప్రకటించారు. కానీ తాజాగా రిలీజ్‌ డేట్‌ని వాయిదా వేశారు.

ఫుల్ టు ఫుల్ యాక్షన్ రొమాంటిక్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం . నవంబర్ 10వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. దీపావళి సందర్భంగా ఈ సినిమాని నవంబర్ 10న విడుదల చేయబోతున్నామంటూ హీరో వైష్ణవ తేజ్ హీరోయిన్ శ్రీలీల రొమాంటిక్ లుక్ ఉన్న ఫోటోలు పోస్టర్ను రిలీజ్ చేశారు . అంతేకాదు ఈ సినిమా మాస్ మూవీ ప్రియులకు యాక్షన్ ప్రియులకు బాగా నచ్చుతుంది అంటూ చెప్పుకు వచ్చారు .

దీంతో ఈ సినిమాకి సంబంధించిన రొమాంటిక్ పోస్టర్ వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో చూసిన ఎవరైనా సరే వైష్ణవ్ తేజ్ ని చూసి కుళ్ళుకోక తప్పదు. ఉప్పెన సినిమాలో కృతి శెట్టి తో ఘాటు రొమాన్స్ చేసిన వైష్ణవ తేజ్ ఈ సినిమాలో శ్రీలీల మరింత నాటి రొమాన్స్ చేయబోతున్నాడు అంటూ చిన్న పోస్టర్ తో హింట్ ఇచ్చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ మెగా మేనల్లుడి పేరు వైరల్ గా మారింది . శ్రీలీల కూడా చాలా నాటిగా రొమాంటిక్ లుక్స్ లో ఆకట్టుకుంటుంది. మొత్తానికి పంజా వైష్ణవ్ ఖాతాలో మరో హిట్ పక్కా అంటూ ఫిక్స్ అయిపోయారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news