Movies"మా జీవితంలో వెలుగు నింపింది నువ్వే".. ఫస్ట్ టైం నీహారిక పోస్ట్...

“మా జీవితంలో వెలుగు నింపింది నువ్వే”.. ఫస్ట్ టైం నీహారిక పోస్ట్ పై పాజిటీవ్ కామెంట్స్..ఎందుకంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం మెగా డాటర్ నిహారికను సోషల్ మీడియాలో ఏకిపారుస్తున్నారు జనాలు . ఆమె ఏ పోస్ట్ పెట్టినా సరే దానికి పడ అర్థాలు తీస్తూ సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు .

అయితే చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం నిహారిక పోస్టుపై పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది . ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టి కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఇరుక్కునే నిహారిక ఫస్ట్ టైం తన పోస్ట్ తో మెగా అభిమానులను ఇంప్రెస్ చేసింది . దీంతో ఈ పోస్ట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి .

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాలభైరవ పుట్టినరోజు నేడు. ఈ క్రమంలోనే ఆయనకు చాలా స్పెషల్గా విష్ చేసింది నిహారిక . ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఆయన ఫన్నీ మూమెంట్స్ ని కొలాగ్ గా మారుస్తూ ..”హ్యాపీ బర్త డే బాబు .. నువ్వు మా జీవితాల్లోకి ఎంతో వెలుగును తీసుకొచ్చావ్” అంటూ చెప్పుకొచ్చింది , దీంతో నిహారిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతే కాదు వీళ్ళిద్దరూ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కూడా తెలుస్తుంది . ఈ క్రమంలోనే నిహారిక చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news