Moviesమెగా ఫ్యామిలీని మ‌ళ్లీ కెలికిన మంచు విష్ణు…. ఆ పేరుతో సెటైర్‌…!

మెగా ఫ్యామిలీని మ‌ళ్లీ కెలికిన మంచు విష్ణు…. ఆ పేరుతో సెటైర్‌…!

మా అధ్యక్షుడు మంచి విష్ణు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మా ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత కూడా మంచి ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య పెద్ద ప్రచ్చన్న యుద్ధమే జరిగింది. ఇక మా ఎన్నికల సమయంలో మంచు ఫ్యామిలీని కొందరు పనికట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ మంచు అభిమానులతో పాటు మంచి విష్ణు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే

తాజాగా మంచి విష్ణు మరోసారి స్పందించారు. ఆయన నిర్మాణంలో భక్తకన్నప్ప అనే భారీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం తాజాగా శ్రీకాళహస్తిలో జరిగింది. ఈ క్రమంలోనే తమ ఫ్యామిలీపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి విష్ణు మాట్లాడారు. తమపై ట్రోలింగ్ చేస్తున్నది.. చేయిస్తున్నది ఎవరో ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసని విష్ణు అన్నారు.

అదొక స్నేక్ బ్యాచ్ చేస్తున్న పని అని విష్ణు అన్నారు. అలాంటి ట్రోలింగ్‌ను తాను పెద్దగా పట్టించుకోనని.. అయితే అవి కొన్నిసార్లు మితిమీరిపోతున్నాయని.. అలాంటి సమయంలో తాను సహించేది లేదని విష్ణు పేర్కొన్నారు. కొంతమంది పనిగట్టుకుని త‌మ ఫ్యామిలీని బ‌ద్నాం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

అయితే నాగ‌బాబును కూడా కొంద‌రు సోష‌ల్ మీడియాలో స్నేక్ బాబు అని సెటైర్లు వేస్తుంటారు. ఇప్పుడు విష్ణు కూడా స్నేక్ బ్యాచ్ అంటూ కామెంట్ చేయ‌డంతో కావాల‌నే విష్ణు మెగా ఫ్యామిలీని కెలికేలా ఈ కామెంట్లు చేశార‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news