Moviesధనుష్ కోసం అలాంటి పని చేస్తున్న రష్మిక.. డివర్స్ తీసుకున్న మగాడి...

ధనుష్ కోసం అలాంటి పని చేస్తున్న రష్మిక.. డివర్స్ తీసుకున్న మగాడి పై ఇంత మోజు ఏంటి తల్లి నీకు..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్ లు స్పాట్ డిసిషన్ లు ఎక్కువగా తీసుకుంటున్నారు . నచ్చితే ఓకే నచ్చకపోతే నో.. ఇదే ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు . అంతేకాదు నచ్చిన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు . కొన్నిసార్లు లిమిట్స్ క్రాస్ చేయడమే కాదు మరి కొన్నిసార్లు రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా వెనకాడడం లేదు. అయితే క్రేజ్ పాపులర్ కి ఉన్న హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే కచ్చితంగా ఆ హీరోయిన్ పై నిందలు పడడం జరుగుతుంది. ప్రెసెంట్ అలాంటి నిందలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది రష్మిక మందన్నా.

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో మనకు తెలిసిందే. పుష్ప సినిమా లాంటి క్రేజీ ప్రాజెక్టు లో నటిస్తూనే మరోపక్క విక్రమ్ లాంటి ఓల్డ్ హీరోతో కూడా నటించడానికి సిద్ధపడుతుంది . అంతేకాదు ఆయనతో లిప్ లాక్ చేయడానికి కూడా సై అన్నిందట. అయితే ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా.. తనకు నచ్చిన హీరోస్ కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకుంటుంది అన్న ప్రచారం ఉప్పందుకుంది. ప్రెసెంట్ ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మొదటి నుంచి సాయి పల్లవి అని ఎక్స్పెక్ట్ చేశారు జనాల్.

కానీ ఆ ప్రాజెక్టు నుంచి సాయి పల్లవిని తప్పిస్తూ రష్మిక మందన్నాను ఫైనలైజ్ చేసుకున్నారు మేకర్స్ . అయితే ఈ సినిమా కోసం రష్మిక న ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించేసిందిట . రీజన్ ఏంటో తెలియదు కానీ శేఖర్ కమ్ముల వచ్చి ప్రాజెక్ట్ గురించి వివరించి..అడగ్గానే ఓకే అంటూ మూడు కోట్లకు ఫైనలైజ్ చేసిందట. అయితే ఇదే విషయంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంత పబ్లిసిటీ పాపులారిటీ ఉన్న హీరోయిన్ ఎందుకు హీరో కోసం రెండు కోట్లు తగ్గించుకుంన్నింది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆఫర్స్ కోసమే ఇలా పారితోషకం తగ్గించుకుంటుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

పెద్ద హీరోలతో అవకాశాలు రావాలి అంటే కొన్ని విషయాల్లో తగ్గాలని ఆ విషయం తెలుసుకుంది కాబట్టి రష్మిక ఖాతాలో ఇన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పుకు వస్తున్నారు. మరి కొంతమంది డివర్స్ తీసుకున్న హీరోపై ఎందుకు నీకు అంత మోజు..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . అంతేకాదు రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ తో బ్రేకప్ అయినప్పటి నుంచి ఏం చేస్తుందో.. ఎలా చేస్తుందో తెలియకుండా బిహేవ్ చేస్తుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news