Moviesఅభిమాని షేక్ హ్యాండ్.. డెటాల్ తో చేతులు కడుకున్న స్టార్ హీరో..పిక్స్...

అభిమాని షేక్ హ్యాండ్.. డెటాల్ తో చేతులు కడుకున్న స్టార్ హీరో..పిక్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలని జనాలు ఎంతలా అభిమానిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వాళ్ళ ఇంట్లో పుట్టిన రోజులు .. పెళ్లిరోజులు.. మనవళ్లు.. మనవరాలు పుడితే తమ ఇంట్లో ఉన్నట్లే సంబరపడిపోతూ ఉంటారు అభిమానులు. అంతేకాదు కొందరు హీరోల కోసం అభిమానులు ఎంత రిస్కైనా చేస్తూ ఉంటారు. అయితే చాలామంది స్టార్ హీరోలు కూడా అలాంటి అభిమానులను బాగా దగ్గరికి తీసుకొని ప్రోత్సహిస్తూ ఉంటారు. అప్రిషియేట్ చేస్తూ ఉంటారు.. వాళ్లతో ఫొటోస్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .

అయితే కొంతమంది మాత్రమే అభిమానుల్ని అస్సలు కేర్ చేయరు. అయితే అదే లిస్టులోకి వస్తాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అంటూ లేటెస్ట్ గా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అజిత్ తన హీరోయిజంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే . మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత ఆ ప్లేస్ ని దక్కించుకున్న ఏకైక హీరో అజిత్ కావడం గమనార్హం . కాగా ఇదే క్రమంలో అజిత్ కి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

అజిత్ ఓ దగ్గర అభిమానులను కలిశారు. ఈ క్రమంలోనే అభిమానులు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు . చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అంతవరకు బాగానే ఉంది ఇక తర్వాత అభిమానులు అటు వెళ్లిపోయిన తర్వాత ఆయన తన చేతులను డెటాల్ తో కడుక్కున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో సోషల్ మీడియాలో అజిత్ పై దుమ్మెత్తి పోస్తున్నారు జనాలు . అసలు అభిమానులు లేకపోతే నీకు ఆ స్టార్ స్టేటస్ ఎక్కడిది ..? ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడిది ..? అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు డెటాల్ తో నీ చేతులను కాదు నీ మనసును శుభ్రం చేసుకో అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఒక్క విషయంతో అజిత్ పై సోషల్ మీడియాలో హ్యూజ్ నెగెటివిటీ పెరిగిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news