Moviesబ‌న్నీ - త్రివిక్ర‌మ్ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా…!

బ‌న్నీ – త్రివిక్ర‌మ్ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా…!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప‌ పార్ట్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పుష్ప 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాని అనౌన్స్ కూడా చేశారు.

త్రివిక్రమ్ చాలా రఫ్గా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి – సన్నాఫ్ సత్యమూర్తి – అల వైకుంఠపురంలో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరి కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ క్రేజీ మూవీ లో ఒక సీనియర్ హీరో కూడా కీలకపాత్రలో నటించే ఛాన్స్ ఉందంట. అతడిది హీరోకి తండ్రి పాత్ర అని తెలుస్తోంది. సెకండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ లో ఈ పాత్ర ఎంటర్ అవుతుందని.. ఈ పాత్ర ట్రాక్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని సమాచారం. బాలీవుడ్ నుంచి ఒక సీనియ‌ర్‌ హీరోని తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది.

హారిక & హాసిని క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఏకధాటిగా జరిగే సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news