Movies' భ‌గ‌వంత్ కేస‌రి ' పై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌… బాల‌య్య...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ పై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌… బాల‌య్య ఫ్యాన్స్‌ ర‌చ్చ దీంతోనే మొద‌లు…!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా భగవంత్‌ కేసరి. యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్యకు కూతురు పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచి భారీ హైప్‌ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

అక్టోబర్ 19న దసరా కానుకగా భ‌గ‌వంత్ కేస‌రి థియేటర్లోకి వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే నెక్స్ట్ మ్యూజికల్ బ్లాస్ట్ స్టార్ట్ కానున్నట్టు కన్ఫర్మ్ అయింది. ఈ వారంలోనే భగవంత్‌ కేసరి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

ఈ సినిమాకు మ్యూజిక‌ల్ సెన్షేష‌న్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. థమన్ – బాలయ్య కాంబినేష‌న్‌కు సరైన సాలిడ్ మ్యూజిక్ ట్రాక్ రికార్డు ఉంది. అఖండ‌తో థియేట‌ర్ల‌లో పూన‌కాల మోత మోగించిన థ‌మ‌న్ వీర‌సింహారెడ్డికి కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు వ‌రుస‌గా మూడోసారి కూడా బాల‌య్య – థ‌మ‌న్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న ఈ సినిమా మ్యూజిక్‌, సాంగ్స్‌, ఆర్ ఆర్‌పై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక భ‌గవంత్ కేస‌రి టీజ‌ర్‌తోనే ర‌చ్చ రంబోలా మామూలుగా లేదు. ఇక ఫ‌స్ట్ సింగిల్ వ‌స్తే బాల‌య్య ఫ్యాన్స్‌ను అస్స‌లు ఆప‌లేం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news