Moviesలాస్ట్ మినిట్ లో ప్లాన్ ఛేంజ్.. బిగ్ బాస్ 7 లోకి...

లాస్ట్ మినిట్ లో ప్లాన్ ఛేంజ్.. బిగ్ బాస్ 7 లోకి అన్ ఎక్స్పెక్టెడ్ కపుల్..!?

కొద్దిరోజులే కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ చూస్తున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కాబోతుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయిపోయాయి. హోస్ట్ గా కూడా నాగార్జున ఫిక్స్ అయిపోయారు . దీనికి సంబంధించిన ప్రోమో సైతం రిలీజ్ అయిపోయింది. మరి కొద్ది రోజుల్లోనే మనం బిగ్ బాస్ సీజన్ సెవెన్ ని టీవీలో చూడబోతున్నాం. కాగా ఇప్పటికే హౌస్ లోకి వెళ్లాల్సిన కంటెస్టెంట్స్ లిస్ట్ మొత్తం రెడీ అయిపోయింది.

సోషల్ మీడియాలో హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే లాస్ట్ మూమెంట్లో ఓ కంటెస్టెంట్ హ్యాండ్ ఇవ్వటంతో షో టి ఆర్ పి లు పెంచడానికి క్రేజీ కపుల్ ని హౌస్ లోకి పంపించబోతున్నారు బిగ్బాస్ మ్యానేజ్ మెంట్ అంటూ ప్రచారం జరుగుతుంది . ఆ జట్ట మరెవరో కాదు ఆట షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సందీప్ – జ్యోతి . వీళ్లిద్దరు ఎంత మంచి డాన్సర్స్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

యూట్యూబ్ ఛానల్ పెట్టి ఓ డ్యాన్స్ స్టూడియో ని కూడా రన్ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా అందరికీ తమ డాన్స్ ని పంచుతున్నారు. కాగ సోషల్ మీడియాలో ఇప్పటికే సందీప్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో మనకి తెలిసిందే . జ్యోతి కూడా బాగా డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది . అయితే ఇలాంటి జంట ఇప్పటికే రెండుసార్లు బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి . అయితే ఈసారి మాత్రం ఈ జంట హౌస్ లోకి వెళ్లడం పక్క అని బల్లగుద్ది చెపుతున్నారు జనాలు . చూడాలి మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news