Moviesఛీ ఛీ ..కృతి శెట్టి దరిద్రం ఎంత ఫాస్ట్ గా ఉందంటే.....

ఛీ ఛీ ..కృతి శెట్టి దరిద్రం ఎంత ఫాస్ట్ గా ఉందంటే.. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలదు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి.. ఎలాంటి పొజిషన్లో ఉందో మనకి బాగా తెలిసిన విషయమే. కాగా ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి ప్రజెంట్ తన చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమానే పట్టుకొని ఉంది. అది కూడా రీసెంట్ గా చేసిన పాన్ ఇండియా ఫిలిం కావడం గమనార్హం . అయితే మొదటి మూడు సినిమాలు ఎలా హిట్ అయ్యాయో తర్వాత రిలీజ్ అయిన నాలుగు సినిమాలు డిజాస్టర్ కావడంతో కృతిశెట్టి పేరుని జనాలు మరిచిపోయే స్థానానికి దిగిపోయారు.

అయితే కృతి శెట్టి తన కెరీర్ లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగానే ఇలా ప్లాప్స్ చవి చూస్తుంది అంటూ జనాలు చెప్పుకుంటున్న క్రమంలో మరో క్రేజీ ఆఫర్ ను రిజెక్ట్ చేసి కృతిశెట్టి పెద్ద తప్పు చేసింది అంటున్నారు అభిమానులు . రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ బేబీ . సాయి రాజేష్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసింది . కాగా సినీ స్టార్స్ అందరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే ఈ కథను మిస్ చేసుకున్న హీరోయిన్స్ ను జనాలు అన్ లక్కి గర్ల్స్ అండ్ ట్రోల్ చేస్తున్నారు . మొదటగా ఈ కథను శ్రీలీలకు వివరించగా ఆమె కొత్త డైరెక్టర్ పైగా యంగ్ హీరోస్ అని రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాతే కృతి శెట్టి కి చెప్పగా సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఉన్నాయి పైగా ఇంత చిన్న హీరోతో బోల్ సీన్స్ చేస్తే కెరీర్ కోలాప్స్ అవుతుంది అంటూ రిజెక్ట్ చేసిందట . ఈ క్రమంలోనే ఈ కథ అటు ఇటు తిరిగి ఫైనల్లీ వైష్ణవి చైతన్య వద్దకు వచ్చింది . అయితే అమ్మడు ఈ సినిమాని సైన్ చేయడానికి మూడు నెలలు పైనే టైం తీసుకుందట ఫైనల్లీ సాయి రాజేష్ ఇచ్చిన ధైర్యంతో వైష్ణవి చైతన్య ఈ సినిమాకు సైన్ చేసి సూపర్ డూపర్ హిట్టు తన ఖాతాలో వేసుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news