Moviesపవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్.. నాటీ పర్ఫామెన్స్ తో చించేసాడు "బ్రో"...

పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్.. నాటీ పర్ఫామెన్స్ తో చించేసాడు “బ్రో” ట్రైలర్ వచ్చేసిందోచ్(వీడియో)..!!

ప్రజెంట్ సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఈగర్ గా .. వెయిట్ చేస్తున్న సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న బ్రో సినిమా కూడా ఉంది . కాగా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి సినిమాలో కనిపించబోతున్నాడు .సముద్ర ఖనీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోని ఇప్పటికే సినిమా షూట్ కంప్లీట్ చేసుకున్న చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ సైతం మొదలుపెట్టేసింది . రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను సాయిధరమ్ తేజ్ కు అప్పగించాడు .

సాయిధరమ్ తేజ్ ఈ సినిమాను తనదైన స్టైల్ లో ప్రమోట్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేశాడు . ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది . దీంతో మెగా ఫాన్స్ పండగ చేసుకునే టైం వచ్చేసినట్లు అయింది .

ఫస్ట్ నుంచి బ్రో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు మెగా ఫాన్స్. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా ద్వారా మరో బద్రి సినిమాలోని పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నామంటూ ఆశపడుతున్నారు. అయితే పవన్ అభిమానులు ఏ విధంగా చూడాలి అనుకున్నారో అదే విధంగా ఏ మాత్రం తగ్గకుండా సముద్రఖని ఈ సినిమాని ఓ రేంజ్ లో తెరకెక్కించారు అని చిన్న ట్రైలర్ తోనే తెలిసిపోతుంది .

కాగా.. ట్రైలర్ విషయానికొస్తే..స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టైం ఒక వాల్యూని ఎంతో క్రియేటివ్ గా చూపించాడు సముద్రఖనీ . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లోని నాటీనెస్ ని సాయిధరమ్ తేజ్ లోని భయాన్ని తెతపై చాలా క్లియర్ కట్గా చూపించాడు . అసలు టైం ఇవ్వడానికే టైం లేనంత బిజీ బిజీగా వెళ్ళిపోయి సాయిధరమ్ తేజ్ లైఫ్ లో టైం ఎంత వాల్యూబుల్ లో చెప్పడానికి దేవుడు రూపంలో దిగి వస్తాడు పవన్ కళ్యాణ్ . ఇదే సినిమాకి మెయిన్ హైలైట్ . అంతేకాదు తెరపై ఈ మామ అల్లుళ్ళ నాటినెస్ ని బాగా క్యాచ్ చేసుకుని చూపించాడు సముద్రఖని. మరి ముఖ్యంగా ట్రైలర్ లో వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫన్నీ డైలాగ్స్ ..ఫన్నీ జోక్స్ ఆహ్లదకరంగా అనిపించాయి. ఎక్కడ వల్గారిటీ అనేది లేకుండా సముద్రిఖని ఈ సినిమాని క్లీన్ గా తెరకెక్కించాడు అని చిన్న ట్రైలర్ తోనే తెలిసిపోతుంది . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బద్రి సినిమా టైంలో ఎలా నాటి నాటి పర్ఫామెన్స్ ఇచ్చారో. అదేవిధంగా ఈ సినిమాలోని నటించినట్లు తెలుస్తుంది . ట్రైలర్ లాస్ట్ లో మ్యూజిక్ రిధమ్‌స్ మారుస్తూ ట్యూన్ నెంబర్ చెప్పే పవన్ కళ్యాణ్ ఉత్సాహం చూస్తుంటే ఈ సినిమాతో మరొక క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకోవడం కన్ఫామ్ అని తెలిసిపోతుంది . ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ టైం ఎంత వాల్యుబుల్ అనేది క్లియర్గా చెప్పబోతున్నాడు..

దీంతో సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ – పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ట్రైలర్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డును కుమ్మేయడానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన సినిమాకి తక్కువ కలెక్షన్స్ రాబట్టాలని చూసిన పవన్ ఫ్యాన్స్ ముందు ఎవరు పనికిరారు అంటూ పవన్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు . చూడాలి మరి పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యి ఆయన కెరియర్ను మళ్ళీ స్టాండర్డ్ పొజిషన్ లో నిలబెడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news