Moviesప్చ్: మహేశ్ కు భారీ బొక్క..గుంటూరు కారం నుండి ఆయన ఔట్.....

ప్చ్: మహేశ్ కు భారీ బొక్క..గుంటూరు కారం నుండి ఆయన ఔట్.. రోజుకు ఓ ట్వీస్ట్ ఇస్తున్నారు ఏంట్రా బాబు..?

పాపం.. మహేష్ బాబు టైమ్ ఏంటో తెలియదు కానీ .. గుంటూరు కారం ఏ ముహుర్తానా సినిమా స్టార్ట్ చేశారో అప్పటినుంచి సినిమాకి వరుసగా బ్రేకులు మీద బ్రేకులు పడుతూనే వచ్చాయి . మొదటగా సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ బంద్ అంటూ కొన్ని రోజులు ఆగిపోయింది . ఆ తర్వాత వాళ్ళ అమ్మ – నాన్న చనిపోవడంతో మరికొన్ని రోజులు పాటు గుంటూరు కారం సినిమా పోస్ట్ పోన్ అయ్యింది.. ఆ తర్వాత డిప్రెషన్ కి గురైన మహేష్ బాబు ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లి అక్కడ కొన్నాళ్లు సినిమా షూట్ మిస్సయింది . ఇలా స్టార్టింగ్ లోనే బాగా ట్రబుల్ అందుకున్న గుంటూరు కారం ..ఈ మధ్య చక చక షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

అయితే సినిమాల్లో పెర్ఫార్మెన్స్ తీరు నచ్చక గుంటూరు కారం సినిమా టీం పై మహేష్ బాబు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది . ఇప్పటికే ఈ సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని తీసేసారు అంటూ వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అది నో అంటూ క్లారిటీ ఇచ్చాడు తమన్. ఆ తర్వాత ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా తీసేసారు అంటూ ప్రచారం జరిగింది. రీసెంట్ గానే మీనాక్షి చౌదరి నేను గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్గా ఈ చిత్రం నుండి టాప్ టెక్నీషియన్ వెళ్లిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

త్రివిక్రమ్ తో అలా వైకుంఠపురంలో సినిమాకి పనిచేసిన పిఎస్ వినోద్ గుంటూరు కారం చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. అయితే ఆయన తాజాగా క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చి ప్రాజెక్టుకు బై బై చెప్పేసారని సమాచారం అందుతుంది . దీంతో గుంటూరు కారం సినిమాకి భారీ బొక్క తప్పదు అనే విధంగా జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అసలు ఎందుకు గుంటూరు కారం సినిమా విషయంలో ఇలా జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు . అయితే త్రివిక్రమ్ తనకి కావాల్సిన వాళ్ళను మాత్రమే పెట్టుకుంటున్నారని .. సినిమా హిట్ అవ్వడానికి ఎన్ని సజిషన్స్ ఇచ్చినా మూర్ఖంగా ఉన్నారని ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇది నిజమో ..? కాదో..? తెలియాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు లేదా మహేష్ బాబు లేదా గుంటూరు కారం టీం స్పందించాల్సిందే..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news