Moviesనీహారిక తెచ్చిన కొత్త ప్రాబ్లమ్.. చరణ్-వరుణ్ ఇద్దరు అడ్డంగా ఇరుక్కునేసారే..!!

నీహారిక తెచ్చిన కొత్త ప్రాబ్లమ్.. చరణ్-వరుణ్ ఇద్దరు అడ్డంగా ఇరుక్కునేసారే..!!

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్ధం చేసుకోవడంతో సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో వరుణ్ తేజ్ ట్రెండ్ అవుతున్నాడు . కాగా ఇదే క్రమంలో రామ్ చరణ్ పేరు సైతం సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది.

దానికి రీజన్ ఆయనకు రీసెంట్గా పాప జన్మించడమే. గత పదకండేళ్ళుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా చూసిన మూమెంట్ ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు రామ్ చరణ్. తనకు మహాలక్ష్మి పుట్టింది అంటూ సంబరపడిపోయాడు . అంతేకాదు ఆమెకు “క్లీం కార” అనే పేరును కూడా పెట్టుకోచ్చారు. అయితే బ్యాక్ టు బ్యాక్ రెండు గుడ్ న్యూస్ లు విన్న మెగా అభిమానులు ఫుల్ ఉబ్బి తబ్బిబ్బై పోయారు.

అయితే ఎవరు ఊహించిన విధంగా ఆ గుడ్ న్యూస్లకు సంబంధించిన ఆనందాన్ని కొన్ని రోజులు కూడా మిగలకుండానే చేసింది నిహారిక . తన భర్తతో విడాకులు కన్ఫామ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . దీనితో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.

అయితే ఇలాంటి క్రమంలోనే పలువురు జనాలు ఆమెతో పాటు చరణ్-వరుణ్ లని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీ ఇంటికి పట్టిన శని ఈ మెగా డాటర్స్ అంటూ హద్దులు మీరిపోతున్నారు. దీంతో మెగా ఫాన్స్ అయితే అన్నల పరువు తీసింది నిహారిక అంటూ మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news