Moviesఅనిల్ రావిపూడి నా మజాకా.. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ చేయని...

అనిల్ రావిపూడి నా మజాకా.. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ చేయని పని బాలయ్య తో చేయించేసాడుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ నట సింహం గా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్య ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా భగవంత్ కేసరి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్లో దశలో ఉంది . ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది . శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో కనిపించబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ పిక్స్ అభిమానులను తెగ ఆకట్టుకునేసాయి. సినిమా కూల్ అండ్ క్లాస్ హిట్ అవుతుందని చెప్పేస్తున్నారు . అయితే ఏ డైరెక్టర్ చేయలేని పని అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలయ్య తో చేయించి నందమూరి అభిమానులకు మరింత స్పెషల్ అయిపోయాడు . మనకు తెలిసిందే బాలయ్య డాన్స్ పరంగా కూసింత వెనకంజ లో ఉన్నారు . అయితే అనిల్ రావిపూడి అభిమానులకు ఆ లోటును తీర్చేశాడు అంటూ తెలుస్తుంది .

ఈ సినిమాలో బాలయ్య ఏకంగా ఫ్లోర్ స్టెప్ వేశారట . అది కూడా డూప్ లేకుండా.. ఎవరి హెల్ప్ లేకుండా ..ఆ స్టెప్ కోసం ఏకంగా 10 రోజులు బాలయ్య ప్రాక్టీస్ చేశాడట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ఎన్టీఆర్ – బన్నీ – చరణ్ లాంటి యంగ్ హీరోల ఫ్లోర్ స్టెప్స్ వేస్తున్న క్రమంలో బాలయ్య ఇలాంటి సీనియర్ హీరో కూడా అదే రేంజ్ లో స్టెప్ చేయడం అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది . అందుకే ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు కుర్రాళ్ళు . దీంతో సోషల్ మీడియాలో భగవంత్ కేసరి హ్యాష్ ట్రెండింగ్ లోకి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news