Moviesరమా కంటే ముందే రాజమౌళి ఆ హీరోయిన్ ని ప్రేమించాడా..? ఎందుకు...

రమా కంటే ముందే రాజమౌళి ఆ హీరోయిన్ ని ప్రేమించాడా..? ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే..?

దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న తెలుగు డైరెక్టర్ రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అపజయం ఎరుగని దర్శకుడుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ డైరెక్టర్ ..కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఆస్కార్ అవార్డును ఇండియన్ ఫిలిం కి తీసుకొచ్చారు . కాగా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. అయితే ఇప్పుడు రాజమౌళి పేరు వింటే గ్లోబల్ స్థాయిలో ఆ న్యూస్ ట్రెండ్ అయిపోతుంది. ఇలాంటి క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా రాజమౌళి సినిమాలపరంగా ఎంత స్టిక్ట్ గా ఉంటాడో ..ఫ్యామిలీ పరంగా అంతే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

రమాను పెళ్లి చేసుకున్న రాజమౌళి.. బిడ్డలను కనకుండానే ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యాడు . అయితే రాజమౌళి కాలేజ్ డేస్ నుంచి ఓ హీరోయిన్ ని ప్రేమించాడు అని ..ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని ..కానీ ఆ హీరోయిన్ కి పెళ్లి అయిపోవడంతో ..ఆమె మీద ఆశలు వదులుకొని .. తన ప్రేమను తనలోనే తుంచేసుకుని లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చాడని.. ఆ టైంలోనే రమా పరిచయం కావడం ఆమెతో ప్రేమలో పడిపోవడం జరిగిందట . అలా ఇప్పుడు రాజమౌళి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఓ గొప్ప తండ్రిగా నిలిచిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news